Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే రికార్డులివే

5 forgotten records in international cricket

హైదరాబాద్: క్రికెట్ అంటేనే గణాంకాలు, రికార్డులు. జెంటిల్‌మెన్ గేమ్‌గా పిలుచుకునే ఈ క్రీడలో పలువురు క్రికెటర్లు ఇప్పటికే అనేక రికార్డులను నెలకొల్పారు. కొంత మంది క్రికెటర్లు నెలకొల్పిన రికార్డులు క్రికెట్ చరిత్రలో అలా నిలిచిపోయాయి. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునే రికార్డుల్లో ఒకటి... టెస్టుల్లో డాన్ బ్రాడ్‌మన్ బ్యాటింగ్ యావరేజి 99.94.

టెస్టు క్రికెట్‌లో అతికొద్ది మంది గుర్తుంచుకునే రికార్డుల్లో మరొకటి భారత బౌలర్ బాపు నాదకర్ణి వరుసగా వేసిన 21 మేడిన్ ఓవర్లు. అయితే, కొన్ని రికార్డులు మాత్రం కాలగమనంలో అధిగమించడం జరిగింది. అలాంటి వాటిల్లో ఒకటి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో సాధించిన 200 పరుగులు.

కాలక్రమంలో ఈ రికార్డుని అనేకమంది క్రికెటర్లు అధిగమించిన సంగతి తెలిసిందే. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ ఐదు రికార్డులు మాత్రం ప్రతి ఒక్క క్రికెట్ అభిమానికి ఎప్పటిక సుపరిచితమే.... అవేంటో ఒక్కసారి చూద్దామా!

టెస్టుల్లో ఎక్కువసార్లు బౌల్డ్ అయిన బ్యాట్స్‌మన్

టెస్టుల్లో ఎక్కువసార్లు బౌల్డ్ అయిన బ్యాట్స్‌మన్

టెస్టుల్లో ఎక్కువసార్లు బౌల్డ్ అయిన బ్యాట్స్‌మన్‌గా టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ నిలిచాడు. అభిమానులు ద్రవిడ్‌ను ముద్దుగా "ది వాల్" అని పిలుచుకుంటున్నప్పటికీ, అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఎక్కువసార్లు బౌల్డ్ అయిన క్రికెటర్‌గా రాహుల్ ద్రవిడ్ నిలవడం ఆశ్చర్యమే. తన కెరీర్‌లో మొత్తం 286 టెస్టు ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ ద్రవిడ్ మొత్తం 55 సార్లు బౌల్డయ్యాడు. ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానంలో సచిన్ టెండూల్కర్ (53), జాక్వస్ కల్లిస్ (46) ఉన్నారు.

వన్డేల్లో ఎక్కువసార్లు గోల్డెన్ డక్స్ అయిన బ్యాట్స్‌మన్

వన్డేల్లో ఎక్కువసార్లు గోల్డెన్ డక్స్ అయిన బ్యాట్స్‌మన్

వన్డేల్లో ఎక్కువసార్లు గోల్డెన్ డక్స్ అయిన ఆటగాడిగా శ్రీలంక పేసర్ లసిత్ మలింగ నిలిచాడు. వన్డే ఫార్మాట్‌లో లసిత్ మలింగ ఇప్పటివరకు 13 సార్లు గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానంలో పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది(12), ముత్తయ్య మురళీధరన్(11), జవగళ్ శ్రీనాథ్(11), మొయిన్ ఖాన్(11) స్థానాల్లో ఉన్నారు.

ఓపెనర్‌గా చివరి ఓవర్ వరకు ఆడిన బ్యాట్స్‌మన్

ఓపెనర్‌గా చివరి ఓవర్ వరకు ఆడిన బ్యాట్స్‌మన్

ఇప్పటివరకు మొత్తం 3000కుపైగా టెస్టు మ్యాచ్‌లాడగా ఓపెనర్‌గా వచ్చిన బ్యాట్స్‌మన్ చివరి వరకు క్రీజులో నిలబడిన సందర్భాలు 53 సార్లు కాగా, అదే 2000కుపైగా జరిగిన వన్డేల్లో ఇలా 11 సందర్భాల్లో మాత్రమే ఇలా సాధ్యపడింది. ఇక, టీ20ల విషయానికి వస్తే ఈ రికార్డు ఒక్క క్రిస్ గేల్ మాత్రమే సొంతం చేసుకున్నాడు. ఈ అరుదైన ఘనతను క్రిస్ గేల్ 2009 ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నీలో శ్రీలంకతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సాధించాడు.

టీ20ల్లో అత్యుత్తమ బౌలర్/కీపర్ కాంబినేషన్

టీ20ల్లో అత్యుత్తమ బౌలర్/కీపర్ కాంబినేషన్

టీ20ల్లో అత్యుత్తమ బౌలర్/కీపర్ కాంబినేషన్‌గా పాకిస్థాన్ వికెట్ కీపర్ కమ్రాన్ ఆక్మల్, బౌలర్ సయిద్ అజ్మల్‌లు నిలిచారు. అజ్మల్ బౌలింగ్‌లో అక్మల్ 15 సార్లు ప్రత్యర్ధి బ్యాట్స్ మెన్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ఇందులో 14 స్టంపింగ్‌లు, ఒక క్యాచ్ ఉన్నాయి. ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్, బౌలర్ షకీబ్ ఉల్ హాసన్(14)లతో రెండో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ధోని ఏడో స్థానంలో ఉన్నాడు. ధోనికి ముందు అక్మల్, రహీమ్, డీకాక్, దినేశ్ రాందిన్, మొహమ్మద్ షెహజాద్‌లు ఉన్నారు.

ఎక్కువ బంతులాడి డకౌట్‌గా వెనుదరిగిన బ్యాట్స్‌మన్

ఎక్కువ బంతులాడి డకౌట్‌గా వెనుదరిగిన బ్యాట్స్‌మన్

టెస్టుల్లో ఎక్కువ బంతులాడి పరుగుల ఖాతా తెరవకుండా డకౌట్‌గౌ వెనుదిరిగిన బ్యాట్స్‌మన్‌గా న్యూజిలాండ్ ఆటగాడు జెఫ్ అలాట్ నిలిచాడు. 1988/89 ఆక్లాండ్ వేదికగా దక్షిణాప్రికాతో జరిగిన ఓ టెస్టులో ఈ చెత్త రికార్డుని జెఫ్ అలాట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 77 బంతులను ఎదుర్కొన్న జెఫ్ అలాట్ సఫారీ బౌలర్ జాక్వస్ కల్లిస్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మొత్తం బంతులను ఎదుర్కొనే క్రమంలో అతడు క్రీజులో 101 నిమిషాల పాటు ఉండటం విశేషం. జెఫ్ అలాట్ తర్వాత ఈ జాబితాలో జేమ్స్ ఆండర్సన్(55 బంతులు), రిచర్డ్ ఎల్లిసన్(52 బంతులు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Story first published: Tuesday, October 9, 2018, 17:41 [IST]
Other articles published on Oct 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+