PHOTOS: బహుశా మీకు తెలియని ధోని యొక్క ఐదు చీకటి రహస్యాలు!

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని.... భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఐసీసీ నిర్వహించే ప్రధాన టోర్నీలను గెలిచిన ఏకైక కెప్టెన్. భారత్‌కు మూడు ఐసీసీ మేజర్ ట్రోఫీలను అందించిన కెప్టెన్ కూడా. ఇలా ధోని గురించి ఎంత చెప్పిన తక్కువే. 2004లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ధోని ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
38 ఏళ్ల ధోని కెరీర్ ప్రస్తుతం చరమాంకానికి చేరుకుంది. ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల మనసుని తొలుస్తోన్న ప్రశ్న ధోని రిటైర్మెంట్ ఎప్పుడు? వన్డే వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత రెండు నెలలు పాటు ధోని క్రికెట్‌కు దూరం కావడంతో అతడి రిటైర్మెంట్‌పై ఇటీవలి కాలంలో అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయి.
తొలుత భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను విండిస్ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత సొంతగడ్డపై జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20 సిరీస్‌కు కూడా ధోని అందుబాటులో లేడు. వచ్చే నెలలో బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కూడా ధోనీ లేడు.
అయితే, ధోని కెరీర్ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో అతడి డార్క్ సీక్రెట్స్(సంబంధాలు కలిగి ఉండటం, క్రికెట్ పరిపాలనలో ప్రభావం చూపడం, చట్టాలను ఉల్లంఘించడం, భారతీయుల మత మనోభావాలను దెబ్బతీయడం)ను ఒక్కసారి పరిశీలిద్దాం...

మేకను బలి ఇవ్వడం
దక్షిణాఫ్రికాలో 2007 టి20 ప్రపంచ కప్ గెలిచిన తరువాత, అదే ఏడాది వన్డేల్లో ధోనికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఫిబ్రవరి 2008లో ఆస్ట్రేలియాలో ధోని నాయకత్వంలోని టీమిండియా ముక్కోణపు సిరిస్ ఆడింది, ఇందులో శ్రీలంక కూడా పాల్గొంది. సిడ్నీ, బ్రిస్బేన్ వేదికల్లో వరుస విజయాలు సాధించిన తర్వాత ధోనిసేన ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడింది. ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి సిరిస్‌ను సొంతం చేసుకుంది. ఈ సిరిస్ విజయం తర్వాత ధోని వివాదంలో చిక్కుకున్నాడు. కెప్టెన్‌గా ధోనికి ఇదే తొలి విదేశీ వన్డే సిరీస్. విదేశీ గడ్డపై కెప్టెన్‌గా తొలి విజయాన్ని నమోదు చేసినందుకు గాను ధోని రాంచీ ఆలయంలో ఓ మేకను బలి ఇచ్చాడు. ధోని చేసిన ఈ పని యావత్ దేశానికి కోపం తెప్పించింది. ఆ తర్వాత ఇలాంటి చేష్టలను ఎప్పుడూ పునరావృతం చేయకుండా చూసుకున్నాడు.

ధోని గ్లోవ్స్ వివాదం
ఇదే ముక్కోణపు సిరిస్‌లో ధోని ధరించిన గ్లోవ్స్ వివాదాస్పదమయ్యాయి. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఐసీసీ సైతం ధోని ధరించిన గ్లోవ్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. తనిఖీ చేయకుండా వాటిని మళ్లీ ఉపయోగిస్తే జరిమానా విధిస్తామని ఐసీసీ టీమిండియా కెప్టెన్ ధోనీని హెచ్చరించింది. ఈ మ్యాచ్‌లో 318 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్(124) సెంచరీతో చెలరేగాడు. చేధనలో గంభీర్(113) పరుగులతో మెరిసినప్పటికీ భారత్ విజయం సాధించలేదు.

చెన్నై సూపర్ కింగ్స్ మ్యాక్ ఫిక్సింగ్ వివాదం
2013 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫిక్సింగ్‌కు పాల్పడటంతో రెండేళ్ల పాటు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనిపై కూడా ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతానికి ఎస్పీ కుమార్ విచారణ అధికారిగా వ్యవహారించారు. అతడి దర్యాప్తులో కిట్టి అనే బుకీ ధోని ఒక మ్యాచ్ ఓడిపోవడానికి (స్కోరు 140 మరియు) అంగీకరించాడని గుర్నాథ్ మేయప్పన్ ఈ మేరకు తనకు సమాచారం ఇచ్చాడని ఒప్పుకున్నట్లు చెప్పాడు. గుర్నాథ్ మేయప్పన్... ధోని ప్రమేయాన్ని ‘ధృవీకరించాడని' ఎస్పీ తన నివేదికలో పేర్కొన్నారు. ఆ తర్వాత అతడు ఇంటర్నల్ సెక్యూరిటీ నుంచి రైల్వేకు బదిలీ చేయబడ్డాడు.

శ్రీనివాసన్-ధోని భాగస్వామ్యం
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్న ధోని ఇండియా సిమెంట్స్‌లో ఉద్యోగిగా కూడా కొనసాగాడు. ఈ నేపథ్యంలో ధోనీని పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం తాకింది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఐసీసీ మాజీ ఛైర్మన్ అయిన ఎన్ శ్రీనివాసన్‌దే ఇండియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఒకానొక సందర్భంలో శ్రీనివాసన్ సిఫారసు వల్లే ధోని తన కెప్టెన్సీని నిలుపుకున్నాడనే వార్తలు అప్పట్లో హల్‌చల్ చేశాయి. ధోని సైతం ఒక కార్యక్రమంలో శ్రీనివాసన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. శ్రీనివాసన్ ఎప్పుడూ క్రికెటర్లకు సహాయం చేస్తుంటాడని చెప్పాడు. దీంతో బీసీసీఐలో కొంతమంది ధోని చాలా తెలివిగల వికెట్ కీపర్ అని, అవసరమైన సమయంలో బీసీసీఐ అధికారుల ద్వారా తనకు కావాల్సిన పనులను ఎలా చక్కబెట్టుకోవాలో తెలుసుని పేర్కొన్నారు.

సినీ పరిశ్రమలో ధోనికి చాలా మందితో సంబంధాలు
జూలై 2010లో ధోని సాక్షిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి జీవా అనే కుమార్తె ఉంది. కానీ పెళ్లికి ముందు ధోనికి సినీ పరిశ్రమలో పలువురితో సంబంధాలు ఉన్నట్లు వార్తలు అప్పట్లో హల్‌చల్ చేశాయి. 2007లో ధోని-దీపికా పదుకొణె వ్యవహారం గురించి పుకార్లు వచ్చాయి. 33 ఏళ్ల దీపికా పదుకొణె 2007లో ఆస్ట్రేలియాతో జరిగిన ఓ టీ20లో ధోనీని ఉత్సాహాపరిచింది. ఆ తర్వాత ఇద్దరూ డేటింగ్ వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2009లో ధోని కామెడీ నైట్స్ విత్ కపిల్ మాజీ క్రియేటివ్ డైరెక్టర్ ప్రీతి సిమోస్‌తో రహస్యంగా డేటింగ్ చేస్తున్నాడని ఊహాగానాలు వచ్చాయి. అయితే, రాయ్ లక్ష్మి మాత్రం ధోనితో తనకు సంబంధం ఉందని అంగీకరించడం విశేషం. ఇది కొన్ని నెలల పాటు కొనసాగిందని రాయ్ లక్ష్మీ ఒక ఇంటర్యూలో వెల్లడించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications