For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాల్గో టెస్టు: సఫారీలపై తొలి రోజు భారత్ స్కోర్ 231/7

By Pratap

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాపై జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచులో తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ ఏడు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అజింక్యా రహనే 89 పరుగులతో, రవిచంద్రన్ అశ్విన్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. పెడిట్ బౌలింగుకు రహనే మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో పెడిట్ నాలుగు వికెట్లు తీసుకోగా, అబాట్‌కు మూడు వికెట్లు దక్కాయి.

4th Test: Virat Kohli wins toss, India bat first in Delhi

దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్సులో భారత్ 139 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. వృద్ధిమాన్ సాహా అబాట్ బౌలింగులో 1 పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. 198 పరగుుల వద్ద భారత్ ఏడో వికెట్‌ను జారవిడుచుకుంది. రవీంద్ర జడేజా 24 పరుగులు చేసి అబాట్ బౌలింగులో అవుటయ్యాడు.

అంతకు ముందు 136 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ మిస్సయ్యాడు. అతను 44 పరుగులు చేసి ప్రెడిట్ బౌలింగులో అవుటయ్యాడు. భారత బౌట్స్‌మెన్‌పై ప్రెడిట్ చెలరేగిపోతున్నాడు. తాజాగా రోహిత్ శర్మ వికెట్ తీశాడు. రోహిత్ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. దీంతో భారత్ 138 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

భారత్ 30 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. మురళీ విజయ్ 12 పరుగులు చేసి పీడ్త్ బౌలింగులో అవుటయ్యాడు. 62 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పీడ్త్ బౌలింగులో అవుటయ్యాడు. భారత్ 66 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఛతేశ్వర్ పుజారా 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అబోట్ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు.

దక్షిణాఫ్రికాపై జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నాలుగు టెస్టు మ్యాచులో సిరీస్‌లో నాలుగు సార్లు కూడా కోహ్లీయే టాస్ గెలిచాడు.

4th Test: Virat Kohli wins toss, India bat first in Delhi

భారత్ ఇప్పటికే 2-0 స్కోరుతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్ తుది జట్టులో ఓ మార్పు చేసింది. అమిత్ మిశ్రా స్థానంలో తుది జట్టులోకి ఉమేష్ యాదవ్‌ను తీసుకుంది. దక్షిణాఫ్రికా మూడు మార్పులు చేసింది. తెంబా భవమ, కైల్ అబోట్, డాన్ పీడ్త్ తుది జట్టులోకి వచ్చారు.

తుది జట్లు

భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహనే, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్

4th Test: Virat Kohli wins toss, India bat first in Delhi

దక్షిణాఫ్రికా: హషీం ఆమ్లా (కెప్టెన్), ఎబి డివిల్లీర్స్, డీన్ ఎల్గార్, ఫాప్ డూ ప్లెసిస్, జెపి డుమిని, డానే విలాస్ (వికెట్ కీపర్), ఇమ్రాన్ తాహిర్, మోర్నె మోర్కెల్, తెంబా బువమ, కైల్ అబోట్, డానే పీడ్త్

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+