చివరి టెస్టుకు కోహ్లీ దూరం?: శ్రేయాస్ అయ్యర్‌కు పిలుపు
హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్టు సిరిస్‌లో చివరిదైన ధర్మశాల టెస్టుకు ముంబై యువ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్‌కు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. గురువారం టీమిండియా ప్రాక్టీస్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ భుజానికి బ్యాండేజీతోనే వచ్చాడు. ప్రాక్టీస్ సెషన్‌కు వచ్చినా బ్యాటింగ్ ప్రాక్టీస్ మాత్రం చేయలేదు.
కొద్ది సేపు వార్మప్‌లో పాల్గొన్న అనంతరం ఫీల్డింగ్‌లో అండర్ ఆర్మ్ త్రోలు మాత్రం విసిరాడు. ఆ తర్వాత ఫిజియోతో సుదీర్ఘంగా చర్చించాడు. భుజంపై ఒత్తిడి పడకుండా ఉండేందుకే అతడు బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు దూరమయ్యాడని అనుకున్నారు. మొత్తంగా తన భుజంపై ఎలాంటి ఒత్తిడి పెంచకుండా ఉండేందుకు కోహ్లీ ప్రయత్నించాడు.
దీంతో ముందు జాగ్రత్తగా బీసీసీఐ కోహ్లీకి ప్రత్యామ్నాయంగా శ్రేయాస్‌ను ఎంపిక చేసింది. శ్రేయాస్ అయ్యర్ శుక్రవారం మధ్యాహ్నం జట్టుతో కలిసే అవకాశముంది. చివరి టెస్టులో కోహ్లీ ఆడే పరిస్థితి లేకపోతే శ్రేయాస్‌ను ఆడించనున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం కోహ్లీకి ఫిట్‌నెస్ పరీక్షను నిర్వహించనున్నారు.

కోహ్లీ ఆడలేని స్థితిలో ఉంటే
అతడు మ్యాచ్ ఆడలేని స్థితిలో ఉంటే అయ్యర్‌కు అవకాశం లభించొచ్చు. కోహ్లీ ఆడలేని పక్షంలో ముందు జాగ్రత్తగా అయ్యర్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ముంబైకి చెందిన ఈ యువ బ్యాట్స్‌మన్ ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేశాడు. గతేడాది రంజీల్లో అత్యధికంగా 1321 పరుగులు చేశాడు.

ఆసీస్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ
ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో శ్రేయాస్ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు తొలిరోజు ఆటలో భాగంగా కోహ్లీ చేతికి గాయమైన సంగతి తెలిసిందే.

రాంచీ టెస్టులో కోహ్లీ భుజానికి గాయం
ఇన్నింగ్స్ 40వ ఓవర్‌లో బంతిని ఆపేందుకు డైవ్ చేసినప్పుడు కెప్టెన్ కోహ్లీ భుజానికి గాయమైంది. జడేజా విసిరిన తొలి బంతిని బౌండరీగా తరలించేందుకు ఆసీస్ బ్యాట్స్‌మెన్ పీటర్ హ్యాండ్స్ కోంబ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో మిడాన్ నుంచి బాల్‌ను వెంబండించిన కోహ్లీ బౌండరీ దాటకుండా ఆపేందుకు డైవ్ చేశాడు.

ఫిజియో సూచన మేరకు కోహ్లీకి విశ్రాంతి
ఆ ప్రయత్నంలో కుడి భుజంపై అతని బరువంతా పడింది. అనంతరం వెంటనే పైకి లేచిన కోహ్లీ తన భుజాన్ని పట్టుకుని ఇబ్బంది పడుతూ కనిపించాడు. వెంటనే మైదానంలోకి వచ్చిన ఫిజియో కోహ్లీకి విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. దీంతో కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు.

గాయం తీవ్రమైనదేమీ కాదని చెప్పిన బీసీసీఐ
కోహ్లీ భుజానికి స్కానింగ్ నిర్వహించి అతని గాయం తీవ్రమైనదేమీ కాదని, మెల్లగా కోలుకుంటున్నాడని బీసీసీఐ ప్రకటించింది. మరోవైపు ఆసీస్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్‌ను సొంతం చేసుకోవాలంటే ఈ ధర్మశాల టెస్టు గెలవడం తప్పనిసరి. మూడు మ్యాచ్‌ల తర్వాత ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications