For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో ఛాన్స్: సాహా ఔట్, నాలుగో టెస్టుకూ పార్థివే

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో రెగ్యులర్ కీపర్ వృద్ధమాన్ సాహా గాయం పాలవడంతో గుజరాత్ వికెట్ కీపర్ పార్ధీవ్ పటేల్‌కు కలిసొచ్చింది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో రెగ్యులర్ కీపర్ వృద్ధమాన్ సాహా గాయం పాలవడంతో గుజరాత్ వికెట్ కీపర్ పార్ధీవ్ పటేల్‌కు కలిసొచ్చింది. మొహాలి టెస్టులో బ్యాటింగ్, కీపింగ్‌లో సత్తా చాటిన పార్దీవ్ పటేల్‌కు టీమిండియాలో స్ధానాన్ని పదిలం చేసుకునేందుకు మరో అవకాశం లభించింది.

ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనున్న నాలుగో టెస్టులో సాహా స్ధానంలో పార్ధీవ్ పటేల్‌ని కొనసాగిస్తూ బీసీసీఐ మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. దీనికి కారణం రెగ్యులర్‌ వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడమే.

మొహాలిలో హీరో పార్ధీవ్: 12ఏళ్లకు అర్ధసెంచరీ, 14ఏళ్లకు తొలి సిక్స్

చీలమండ గాయంతో బాధపడుతున్న సాహా డిసెంబర్‌ 8న ప్రారంభం కానున్న నాలుగో టెస్టు నాటికి కోలుకునే అవకాశాలు తక్కువగా ఉండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయపడ్డాడు.

గాయం నుంచి సాహా కోలుకోలేని విషయాన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ కూడా ధ్రువీకరించింది. దీంతో సాహాకు నాలుగు టెస్టులో విశ్రాంతిని కల్పించింది. ఇక 31 ఏళ్ల పార్ధీవ్ పటేల్ 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మొహాలి టెస్టుతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మొహాలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో సాహా 42, 67 పరుగులతో రాణించడంతో ఇంగ్లాండ్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నెల 9వ తేదీన ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ వివాహం జరగనున్న నేపథ్యంలో టెస్టు జట్టు నుంచి బీసీసీఐ అతడిని విడుదల చేసింది.

ఫోటోలు: 84 ఏళ్ల తర్వాత టీమిండియా అరుదైన రికార్డు

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌పై భారత్ 0-2తో ఆధిక్యంలో నిలిచింది. రాజ్ కోట్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విశాఖపట్నం, మొహాలిలో జరిగిన టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+