సిడ్నీ టెస్ట్‌లో ఆస్ట్రేలియా 236/6: బ్యాడ్ లైట్‌తో మూడో రోజు నిలిచిన మ్యాచ్

హైదరాబాద్: సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టులో మూడో రోజు ఆటకు బ్యాడ్ లైట్ అడ్డంకిగా మారింది. శనివారం స్టేడియంలో చిరుజల్లులు పడుతుండటంతో వెలుతురు తక్కువైంది. వెలుతురు లేమి కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేశారు. మూడో రోజు ఆట నిలిచిపోయే సమయానికి ఆసీస్ 236/6తో నిలిచింది.
టీ విరామం తర్వాత వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలించలేదు. దీంతో మ్యాచ్ నిలిపివేసే సమయానికి ఆస్ట్రేలియా 83.3 ఓవర్లకు గాను ఆరు వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ప్రస్తుతం పాట్‌కమిన్స్(25), పీటర్ హాండ్స్‌కాంబ్(28) క్రీజులో ఉన్నారు. ఇద్దరూ కలిసి 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగుల వెనుకంజలో ఆసీస్
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఇంకా 386 పరుగులు వెనుకబడి ఉంది. నాలుగో టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ని 622/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆటలో భాగంగా రెండో రోజైన శుక్రవారం ఓవర్ నైట్ స్కోరు 303/4తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియాలో పుజారా (193), రిషబ్ పంత్ (159 నాటౌట్) సెంచరీలు నమోదు చేయడంతో భారీ స్కోరు చేసింది.
198 పరుగులకే వికెట్లు కోల్పోయిన ఆసీస్
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఓపెనర్ హారిస్ (79) హాఫ్ సెంచరీతో రాణించగా, ఉస్మాన్ ఖవాజా (27), లాబస్‌ఛేంజ్ (38) అతనికి సహకరించారు. అయితే మిడిలార్డర్ వైఫల్యం ఆస్ట్రేలియాను దెబ్బకొట్టింది. దీంతో ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాన్ మార్ష్ (8), ట్రావిస్ హెడ్ (20), టిమ్ పైన్ (5) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు.
బ్యాడ్ లైట్ కారణంగా 236/6 వద్ద ఆటను నిలిపివేసిన అంఫైర్లు
దీంతో ఆస్ట్రేలియా 198 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన బౌలర్ కమ్మిన్స్ (25) మరోసారి బ్యాట్‌తో రాణించాడు. హాండ్స్‌కాంబ్ (28)తో కలిసి ఆసీస్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఈ దశలో వెలుతురు లేమి కారణంగా ఆస్ట్రేలియా స్కోరు 236/6 వద్ద ఆట అంఫైర్లు నిలిపివేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసుకోగా, జడేజా రెండు వికెట్లు తీసుకున్నాడు.
మ్యాచ్‌లో ఇంకా రెండు రోజులు మిగిలున్నాయి
మ్యాచ్‌లో ఇంకా రెండు రోజులు మిగిలి ఉండటంతో విజయం భారత్ వైపే మొగ్గు చూపుతోంది. ఈ టెస్టులో ఆతిథ్య జట్టు అద్భుత ప్రదర్శన చేస్తే తప్ప ఓటమి తప్పించుకునే పరిస్థితి లేదు. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ భారత్ 2-1తో సిరీస్ గెలుచుకుంటుంది. దీంతో ఆసీస్‌లో టెస్టు సిరీస్ గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications