కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా చేతిలో భారత్ క్రికెట్ జట్టుకు నాలుగో వన్డే మ్యాచులోనూ పరాభవం తప్పలేదు. భారత్ చేజేతులా మ్యాచును జారవిడుచుకుంది. ఆరంభం అదిరినప్పటికీ మిడిలార్డర్ చేతులెత్తేయడంతో ఓటమి పాలు కాకతప్పలేదు. కెప్టెన్ ధోనీ సహా ఆ తర్వాత దిగిన బ్యాట్స్‌మెన్ ఎవరూ ఆత్మస్థయిర్యంతో ఆడినట్లు లేదు. దాంతో 25 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ ఓటమి పాలైంది.
భారత్ 49.2 ఓవర్లలో 323 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసి భారత్‌కు సవాల్ విసిరింది. ఆస్ట్రేలియా బౌలర్లలో రిచర్డ్సన్ ఐదు వికెట్లు తీయగా, మార్ష్, హాస్టింగ్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. లియోన్‌కు ఒక వికెట్ దక్కింది. 277 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన భారత్ రిచర్డ్సన్ బౌలింగ్ ధాటికి కుప్పకూలింది. 46 పరుగుల తేడాతో చివరి తొమ్మిది వికెట్లు కోల్పోయింది.
ఆస్ట్రేలియా తన ముందుంచిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది. దాంతో భారత్ 65 పరుగుల వద్ద తొలి వికెట్‌ను జారవిడుచుకుంది. రోహిత్ శర్మ 41 పరుగులు చేసి రిచర్డ్సన్ బౌలింగులో అవుటయ్యాడు. శిఖర్ దావన్ అర్థ సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ కూడా తన అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. భారత ఓపెనర్ సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ కూడా సెంచరీ చేశాడు. 84 బంతుల్లో 11 ఫోర్లు ఓ సిక్సర్ సాయంతో అతను 101 పరుగులు చేశాడు.
భారత్ 277 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ 126 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హాస్టింగ్స్ బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత వెంటనే కెప్టెన్ ధోనీ అతని బౌలింగులోనే సున్నా పరుగులకు అవుటయ్యాడు. 278 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్‌ను జారవిడుచుకుంది. కోహ్లీ 106 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిచర్డ్సన్ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు.
భారత్ 308 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను జారవిడుచుకుంది. రిషి ధావన్ 9 పరగుులు చేసి రిచర్డ్సన్ బౌలింగులో వెనుదిరిగాడు. భారత్ 311 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ రిచర్డ్సన్ బౌలింగులో రెండు పరుగులు చేసి అవుటయ్యాడు. 315 పరుగుల వద్ద భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఉమేష్ యాదవ్ కేవలం రెండు పరుగులు చేసి ఔటయ్యాడు.
286 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. గుర్‌కిరత్ సింగ్ ఐదు పరుగులు మాత్రమే చేసి లియోన్ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు.

నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది. భారత్‌తో జరిగిన నాలుగో వన్డే మ్యాచులో ఆస్ట్రేలియా 319 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. ఉమేష్ యాదవ్ బౌలింగులో ఫౌల్కనర్ పరుగులేమీ చేయకుండా ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. 321 పరుగుల వద్ద ఏడు వికెట్లు కోల్పోయింది. వాడే రన్నవుట్ అయ్యాడు. 187 పరుగుల వద్ద తొలి వికెట్, 221 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా ఆ తర్వాత త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. ముగ్గురు బ్యాట్స్‌మెన్ ఫౌల్కనర్, వాడే, హాస్టింగ్స్ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరుకున్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ నాలుగు వికెట్లు తీసుకోగా, ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు తీసుకున్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో ఎట్టకేలకు భారత్ ఓ వికెట్ తీయగలిగింది. డేవిడ్ వార్నర్ 93 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాంత్ శర్మ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో 187 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 221 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 107 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్ ఉమేష్ యాదవ్ బౌలింగులో అవుటయ్యాడు.
భారత్‌పై జరిగిన నాలుగో వన్డే మ్యాచులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బుధవారం నాడు జరుగుతున్న ఈ మ్యాచులో భారత్ జట్టులో ఓ మార్పు చేసింది. బరీందర్ శ్రాన్ స్థానంలో భువనేశ్వర్ కుమార్‌ను తుది జట్టులోకి తీసుకుంది.
ఆస్ట్రేలియా ఇప్పటికే 3-0 స్కోరుతో ఐదు వన్డేలో సిరీస్‌ను కైవసం చేసుకుంది. పెర్త్, బ్రిస్బేన్, మెల్బోర్న్‌ల్లో జరిగిన మూడు వన్డేల్లోనూ ఆస్ట్రేలియా విజయం సాధించింది.

జట్లు
ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, జార్జ్ బెయిలీ, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, మాథ్యూ వాడే (వికెట్ కీపర్), జేమ్స్ ఫౌల్కనర్, జాన్ హాస్టింగ్స్, స్కాట్ బోలండ్, కానే రిచర్డ్సన్, నాథన్ లియోన్, షాన్ మార్ష్
భారత్: ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహనే, మనీష్ పాండే, గుర్‌కీరత్ సింగ్ మన్, రిషి ధావన్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఆక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమర్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, బరీందర్ శ్రాన్.