వాండరర్స్‌లో 4వ వన్డే: కోహ్లీ ముంగిట మరో రికార్డు, ఏబీని అధిగమిస్తాడా?

హైదరాబాద్: క్రికెట్‌లో ఉన్న అన్ని రికార్డులను విరాట్ కోహ్లీ బద్దులు కొడుతూ పోతున్నాడు. ప్రస్తుతం సఫారీ పర్యటనలో ఉన్న కోహ్లీసేన చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇప్పటివరకు జరిగిన మూడు వన్డేల్లో కోహ్లీసేన వరుసగా మూడు వన్డేల్లో విజయం సాధించి సిరిస్‌లో 3-0 ఆధిక్యంలో నిలిచింది. సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జోహెన్స్‌బర్గ్ వేదికగా నాలుగో వన్డే శనివారం (ఫిబ్రవరి 10)న జరగనుంది. ఈ వన్డేలో కోహ్లీసేన విజయం సాధిస్తే సఫారీ గడ్డపై భారత జట్టు నయా చరిత్రను లిఖిస్తుంది. ఎందుకంటే సఫారీ గడ్డపై టీమిండియా ఇప్పటివరకూ టెస్టు సిరిస్‌తో పాటు వన్డే సిరీస్‌ను గెలవలేదు.

భారత్‌కు ఓ సువర్ణావకాశం
దీంతో ఈ సిరిస్‌ను గెలిచేందుకు గాను భారత్‌కు ఓ సువర్ణావకాశం. ఈ సిరిస్‌లో ఇప్పటివరకు జరిగిన మూడు వన్డేల్లో విరాట్ కోహ్లీ 318 పరుగులతో భారత్ తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్‌లు 21 వికెట్లు తీశారు. ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా డర్బన్‌లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 112 పరుగులు చేయగా, ఆ తర్వాత సెంచూరియన్‌లో జరిగిన రెండో వన్డేలో 46 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

భారత్ విజయాల్లో కోహ్లీ కీలకపాత్ర
ఇక, కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 160 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో పాటు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ.... దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ రికార్డుని అధిగమించేందుకు గాను కేవలం 41 పరుగుల దూరంలో ఆగిపోయాడు. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరిస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఏబీ డివిలియర్స్ (358) ఉన్నాడు.

2015లో డివిలియర్స్ రికార్డు
2015లో సఫారీలు భారత పర్యటనకు వచ్చిన సమయంలో డివిలియర్స్ ఈ రికార్డుని నమోదు చేశాడు. అంతేకాదు ఈ సిరిస్‌ను సఫారీలు 3-2తేడాతో కైవసం చేసుకున్నారు. స్వదేశంలో భారత్‌ను ఓడించడం సఫారీలకు అదే మొదటిసారి. ముంబై వేదికగా జరిగిన ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా 214 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డీకాక్ (109), డుప్లెసిస్ (133), ఏబీ డివిలియర్స్ (119) సెంచరీలు నమోదు చేయడంతో సఫారీలు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 438 పరుగులు చేశారు.

224 పరుగులకే కుప్పకూలిన భారత్
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 224 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికాపై అప్పటి ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాకు ఇదే చక్కటి అవకాశం. డివిలియర్స్ రికార్డుని బద్దలు కొట్టడంతో పాటు సఫారీ గడ్డపై గత 25 ఏళ్లలో ఏ భారత కెప్టెన్ సాధించనటువంటి రికార్డు కోహ్లీ సొంతమవుతుంది. సఫారీ గడ్డపై వన్డే సిరిస్ గెలిచిన జట్టుగా కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుంది.

వన్డే సిరిస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరిస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు:
* 358 - AB de Villiers (5 matches)
* 342 - Quinton de Kock (3)
* 342 - Kepler Wessels (7)
* 323 - Faf du Plessis (5)
* 318 - Virat Kohli (3)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications