4th ODI Highlights: టర్నర్ విధ్వసం, భారత్ ఓటమి, సిరిస్ 2-2తో సమం

India vs Australia 2019: 4th ODI Match Highlights | Turner's quick Score Of 84 Runs Helps Aus To Win
team india

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారత్‌ ఓటమి పాలైంది. మొహాలి వేదికగా ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో 358 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ.. పేలవ బౌలింగ్, ఫీల్డింగ్ కారణంగా టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 359 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఇంకా 13 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఐదు వన్డేల సిరీస్‌ 2-2తో సమం అయింది. సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే ఐదో వన్డే ఢిల్లీ వేదికగా బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి జరగనుంది. ఆసీస్ ఆటగాడు టర్నర్ (84 నాటౌట్: 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులు)‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

4th ODI: రోహిత్-ధావన్ రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యంపై ప్రశంసల వర్షం

మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసిన టర్నర్

మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసిన టర్నర్

ఆసీస్‌ ఆటగాడు ఆస్టన్‌ టర్నర్‌ 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు చేసి మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్ (0), షాన్ మార్ష్ నిరాశపరిచినా.. హ్యాండ్స్‌కబ్ (117), ఉస్మాన్ ఖవాజా (91)ల జోడీ మూడో వికెట్‌కి అభేద్యంగా 192 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

 ఆకాశమే హద్దుగా చెలరేగిన టర్నర్

ఆకాశమే హద్దుగా చెలరేగిన టర్నర్

అటు తర్వాత మ్యాక్స్‌వెల్‌(23) బ్యాట్ ఝుళిపించినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి దిగిన టర్నర్ బౌండరీల లక్ష్యంగా విజృంభించాడు. బౌలర్‌ ఎవరన్నది చూడకుండా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టర్నర్ భారీ హిట్టింగ్‌తో మరో 13 బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు.

టర్నర్‌ స్టంపింగ్‌‌‌ను వదిలేసిన రిషబ్ పంత్

టర్నర్‌ స్టంపింగ్‌‌‌ను వదిలేసిన రిషబ్ పంత్

ఈ మ్యాచ్‌లో ధోని స్థానంలో వికెట్ కీపర్‌గా జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ స్పిన్నర్ చాహల్ బౌలింగ్‌లో టర్నర్‌ స్టంపింగ్‌‌‌ను వదిలేయగా.. కేదార్ జాదవ్, శిఖర్ ధావన్ సులువైన క్యాచ్‌లు జారవిడవడం అతడికి బాగా కలిసొచ్చింది. అంతకముందు ఓపెనర్లు శిఖర్ ధావన్ (143), రోహిత్ శర్మ (95) అద్భుత ప్రదర్శన చేయడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది.

1
45588
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Story first published: Sunday, March 10, 2019, 22:25 [IST]
    Other articles published on Mar 10, 2019
    POLLS

    Get breaking news alerts from myKhel

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more