4th ODI: గబ్బర్ ఈజ్ బ్యాక్! వన్డేల్లో 16వ సెంచరీపై ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం


హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఎట్టకేలకి మళ్లీ ఫామ్ అందుకున్నాడు. వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా ఆస్ట్రేలియాతో ఆడుతున్న చివరి వన్డే సిరిస్‌లో మొదటి మూడు వన్డేల్లో శిఖర్ ధావన్ పేలవ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆదివారం ఆస్ట్రేలియాతో మొహాలి వేదికగా జరిగిన నాలుగో వన్డేలో సెంచరీతో చెలరేగాడు.
వన్డేల్లో ధావన్‌కి ఇది 16వ సెంచరీ
కేవలం 97 బంతుల్లోనే 12 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 100 పరుగులు సాధించాడు. వన్డేల్లో ధావన్‌కి ఇది 16వ సెంచరీ కావడం విశేషం. సెంచరీ తర్వాత మరింత దూకుడుగా ఆడే క్రమంలో ధావన్ (143: 115 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సులు) వద్ద ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
ఈ ఏడాది 11 వన్డేలాడిన శిఖర్ ధావన్
ఈ వన్డేకి ముందు ఈ ఏడాది 11 వన్డేలాడిన శిఖర్ ధావన్ వరుసగా 0, 32, 23, 75*, 66, 28, 13, 6, 0, 21, 1 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలతో పాటు.. రెండు డకౌట్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు చివరి ఆరు మ్యాచ్‌ల్లోనూ కనీసం ఒక 50+ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పలేకపోయాడు.
మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్
మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో శిఖర్ ధావన్‌పై సందేహాలు నెలకొన్నాయి. అయితే, మొహాలీలో సెంచరీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన శిఖర్ ధావన్.. రోహిత్ శర్మ (95: 92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు)తో కలిసి తొలి వికెట్‌కి 193 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారీ స్కోరు దిశగా బాటలు వేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications