For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వాతావరణ మార్పులే భారత్‌ను ఓడించాయా..? ధావన్ సెంచరీ, కోహ్లీ హాఫ్

4th ODI: Dhawan's ton in 100th ODI goes in vain as South Africa beat India by 5 wickets

హైదరాబాద్: వరుస మూడు ఓటములతో నిరాశకు గురైన దక్షిణాఫ్రికా జట్టుకు నాలుగో వన్డే విజయం కాస్త ఊరటనిచ్చింది. కానీ, భారత్‌కు మాత్రం తొలి సిరీస్ కోసం ఎదురుచూపులు తప్పని పరిస్థితి నెలకొంది. గెలుపోటముల ఉత్కంఠతో మలుపులు తిరిగిన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికానే విజయం సాధించింది. 28 ఓవర్లలో 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. 25.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ప్రకృతి బీభత్సానికి:

ప్రకృతి బీభత్సానికి:

భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 289 పరుగులు చేసింది. వందో వన్డే ఆడుతూ శిఖర్‌ ధావన్‌ సెంచరీ 105 బంతుల్లో 109 చేశాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 83 బంతుల్లో 75 మరోసారి చక్కటి బ్యాటింగ్‌తో అలరించాడు. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు 158 పరుగులు జోడించారు. వీళ్లిద్దరి భాగస్వామ్యంలో చక్కటి స్కోరును సాధిస్తారనుకున్నా.. తడబడి ఓ మోస్తరు స్కోరుతో సరిపెట్టుకున్నారు.

ధనాధన్‌ ధావన్‌-కోహ్లి:

ధనాధన్‌ ధావన్‌-కోహ్లి:

మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన భారత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. వైఫల్యాల బాట వీడని రోహిత్‌ 5 పరుగులకే రబాడకు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతో కోహ్లి మరోసారి త్వరగా క్రీజులోకి వచ్చేశాడు. వన్డే సిరీస్‌ ఆరంభం నుంచి మెరుపులు మెరిపిస్తున్న ధావన్‌.. తన వందో వన్డేలో చెలరేగిపోయాడు. కోహ్లి కూడా దూకుడుగా ఆడటంతో భారత ఇన్నింగ్స్‌ 6కు పైగా రన్‌రేట్‌తో దూసుకెళ్లింది. ధావన్‌ తనదైన పుల్‌ షాట్లు, లెగ్‌ ఫ్లిక్‌లతో సునాయాసంగా పరుగులు సాధించాడు.

కోహ్లీ హాఫ్, ధావన్ ఫుల్ పనికి రాలేదు:

కోహ్లీ హాఫ్, ధావన్ ఫుల్ పనికి రాలేదు:

మరోవైపు కోహ్లి చక్కటి ఫుట్‌వర్క్‌తో అద్భుతమైన షాట్లు ఆడాడు. ధావన్‌ 53 బంతుల్లో, కోహ్లి 56 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేశారు. ధావన్‌ శరవేగంగా సెంచరీ వైపు కదిలాడు. విరాట్‌ కూడా మరో సెంచరీపై కన్నేసినట్లే కనిపించాడు. వీరి భాగస్వామ్యం 150 దాటగా.. భారత్‌ 178/1తో తిరుగులేని స్థితిలో నిలిచింది. ఐతే తర్వాతి ఓవర్లో మోరిస్‌.. కోహ్లి ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

వాతావరణం సహకరించక:

వాతావరణం సహకరించక:

కోహ్లి వెనుదిరిగినా.. ధావన్‌ జోరు కొనసాగిస్తూ సెంచరీ (99 బంతుల్లో) పూర్తి చేశాడు. అయితే 35వ ఓవర్లో భారత్‌ 200/2తో మంచి స్థితిలో ఉండగా వాతావరణం మార్పుల కారణంగా మ్యాచ్‌ ఆగిపోయింది. గంట పైగా విరామం తర్వాత మళ్లీ మ్యాచ్‌ మొదలైంది. ధావన్‌, రహానె (8) వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేరిపోయారు. శ్రేయస్‌ అయ్యర్‌ (18), పాండ్య (9) కూడా నిలవలేదు. మిగిలిన ధోనీ ఒక్కడే మంచి షాట్లతో 43 బంతుల్లో 42 పరుగులు చేసి భారత్‌ ఇన్నింగ్స్‌‌ను మంచి స్కోరుతోనే ముగించాడు.

తొలి వికెట్ పడగానే:

తొలి వికెట్ పడగానే:

ఛేదనలో దక్షిణాఫ్రికాకు ఓ మోస్తరు ఆరంభం లభించింది. క్లాసెన్‌ 27 బంతుల్లో 43, మిల్లర్‌ 28 బంతుల్లో 39, ఫెలుక్వాయో 5 బంతుల్లో 23 విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆమ్లా (33), మార్‌క్రమ్‌ (22) తొలి వికెట్‌కు 43 పరుగులు జోడించారు. 8వ ఓవర్లో మార్‌క్రమ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని భారత్‌కు తొలి వికెట్‌ అందించాడు బుమ్రా. అప్పుడే వర్షం వల్ల మ్యాచ్‌ ఆగింది.

సఫారీలు పరువు నిలబెట్టుకున్నారు:

సఫారీలు పరువు నిలబెట్టుకున్నారు:

మళ్లీ మ్యాచ్‌ మొదలయ్యాక లక్ష్యాన్ని సవరించడంతో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడారు. డుమిని (10) త్వరగానే ఔటైనప్పటికీ.. డివిలియర్స్‌ భారీ షాట్లతో కాసేపు గుబులు రేపాడు. అతడిని పాండ్య ఔట్‌ చేయడంతో భారత్‌‌కు మళ్లీ ఆశలు మొదలయ్యాయి. అయితే మిల్లర్‌, క్లాసెన్‌ పట్టు వదల్లేదు. రెండో వన్డే ఆడుతున్న క్లాసెన్‌ ఆశ్చర్యకర షాట్లతో చెలరేగాడు. మిల్లర్‌ అండతో క్లాసెన్‌ రెచ్చిపోయి ఆడాడు. అడ్డదిడ్డంగా షాట్లు ఆడిన అతను స్పిన్నర్ల లయను పూర్తిగా దెబ్బ తీశాడు.

చాహల్‌కు ఎదురుదెబ్బ:

చాహల్‌కు ఎదురుదెబ్బ:

చాహల్‌ బౌలింగ్‌లో మిల్లర్‌ 6 పరుగులపై ఉండగా అతడి క్యాచ్‌ను అయ్యర్‌ వదిలేయగా.. అదే ఓవర్లో మిల్లర్‌ బౌల్డయినప్పటికీ, అది నోబాల్‌గా తేలడంతో అతను మరోసారి బతికిపోయాడు. ఇక్కడే మ్యాచ్‌ మలుపు తిరిగింది. లక్ష్యానికి 28 పరుగుల దూరంలో మిల్లర్‌ వెనుదిరిగినా దక్షిణాఫ్రికాకు ఇబ్బంది లేకపోయింది. తర్వాత వచ్చిన ఫెలుక్వాయో చెలరేగిపోవడంతో ఇంకో 15 బంతులుండగానే దక్షిణాఫ్రికా విజయం పూర్తయింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, February 11, 2018, 12:46 [IST]
Other articles published on Feb 11, 2018
Read in English: Dhawan ton goes in vain
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+