Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కాలగర్భంలో చరిత్ర: 60 ఏళ్లలో భారత్-పాక్‌ మధ్య 46 మ్యాచ్‌లేనా

హైదరాబాద్: భారత్-పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ జరుగుతుంటే చాలు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. అభిమానులు సైతం భారత జట్టు పాకిస్థాన్‌లో ఓటమిని సహించలేరు. అయితే దాయాది దేశాల మధ్య జరిగిన హాకీ మ్యాచ్‌లను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) కాలగర్భంలో కలిపేయాలనే నిర్ణయం తీసుకుంది.

నిజానికి హాకీ క్రీడలో భారత్-పాకిస్థాన్ సమరానికి ఆరు దశాబ్ధాల చరిత్ర ఉంది. ఇప్పుడు ఈ చరిత్రను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) చెరిపేస్తుంది. 1956, మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌ ఫైనల్లో భారత్-పాకిస్థాన్‌లు తొలిసారిగా తలపడ్డాయి. అంటే గత ఆరు దశాబ్దాలుగా ఇరు జట్లు తమ ఆటతో అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి.

గడచిన 60 సంవత్సరాల్లో భారత్-పాకిస్థాన్ జట్లు ప్రపంచంలోని అనేక వేదికలపై 166 సార్లు తలపడ్డాయి. అందులో భారత్ 54 సార్లు గెలవగా, పాకిస్థాన్ 82 సార్లు విజయం సాధించింది. మరో 30 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. తాజాగా ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో ఆదివారం జరిగిన భారత్-పాక్‌ మధ్య మ్యాచ్‌కు జరిగింది.

46 matches played between India and Pakistan over 60 years

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ 3-2 తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఎఫ్‌ఐహెచ్‌ అధికారిక గణాంకాల ప్రకారం భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య 46 మ్యాచ్‌లు మాత్ర మే జరిగినట్టు చూపిస్తోంది. అంతేకాదు ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వాహకులు కూడా ఇదే డాటాను అందించారు.

ఇలా చేయడం ద్వారా మన ఆటగాళ్లు సాధించిన పతకాలు, వారి వివరాలు భవిష్యత తరాలకు తెలిసే అవకాశం లేదు. మరోవైపు పాకిస్థాన్‌పై టీమిండియా ఆటగాళ్లు 321 గోల్స్‌ చేస్తే.. ఎఫ్‌ఐహెచ్‌ రికార్డుల ప్రకారం 98 గోల్స్‌ మాత్రమే నమోదయ్యాయి. 223 గోల్స్‌ ఎఫ్‌ఐహెచ్‌ లెక్కల్లో చూపించడం లేదు.

ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌తో కలిపి ఎఫ్‌ఐహెచ్‌ రికార్డుల ప్రకారం 60 ఏళ్లలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య 47 మ్యాచ్‌లు జరిగాయని... అందులో భారత్ 19, పాక్‌ 25 మ్యాచ్‌లు నెగ్గాయి. మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయని డేటా చూపిస్తోంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+