Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

39 బంతులు.. 1 పరుగు.. అభినందనలతో దద్దరిల్లిన స్టేడియం(వీడియో)!!

45 minutes, 39 balls: Steve Smith receives standing ovation after getting off the mark

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మన్‌లు. ఈ ఇద్దరూ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కోసం పోటీపడుతున్నారు. కొన్ని రోజులు స్మిత్‌ అగ్రస్థానంలో ఉండగా.. మరికొన్ని రోజులు కోహ్లీ ఉన్నాడు. ఇలానే 2019 మొత్తం గడిచింది. ఈ 2020లో కూడా రసవత్తర పోటీ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ పోటీకి ప్రధాన కారణం ఇద్దరూ సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడమే.

39 బంతులు.. 1 పరుగు:

39 బంతులు.. 1 పరుగు:

సిడ్నీ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌ సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (45) ఔట్ అయిన అనంతరం సెకండ్‌ డౌన్‌లో స్మిత్ బ్యాటింగ్‌కు వచ్చాడు. క్రీజులో పాతుకుపోయిన స్మిత్‌.. తొలి పరుగు చేయడానికి 39 బంతులు ఆడాడు. అంతేకాదు 45 నిమిషాల తర్వాత పరుగు చేసాడు. కివీస్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేసినా.. సమర్ధంగా ఎదుర్కొన్నాడు.

చప్పట్లతో అభినందనలు:

అన్ని బంతులు ఆడి సింగిల్‌ తీసిన స్మిత్‌ను ఆసీస్ అభిమానులు ఆకాశానికెత్తారు. సిడ్నీ స్టేడియంలోని అభిమానులు లేచి మరీ స్మిత్‌ను చప్పట్లతో అభినందించారు. ఒక బ్యాట్స్‌మన్‌ సెంచరీ చేసిన తర్వాత అభిమానుల అభినందించడం సాధారణం. కానీ ఇక్కడ ఆసీస్‌ అభిమానులు మాత్రం పరుగు తీసిన తర్వాత అతన్ని చప్పట్లతో అభినందించడం విశేషం. సింగిల్ కోసం 39 బంతులు ఆడిన స్మిత్.. 143 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

2020లో తొలి టెస్టు సెంచరీ:

2020లో తొలి టెస్టు సెంచరీ:

మార్కస్‌ లబూషేన్‌తో కలిసి స్మిత్ 100కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పాడు. అయితే 63 పరుగుల వద్ద డి గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. మరోవైపు లబూషేన్‌ ఈ ఏడాదిని కూడా ఘనంగా ఆరంభించాడు. తొలి రోజు ఆటలో లబూషేన్‌ శతకంతో మెరిశాడు. ఫలితంగా 2020లో తొలి టెస్టు సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా తన కెరీర్‌లో 13 టెస్టులు ఆడిన లబూషేన్‌ 4 సెంచరీలు, 6 హాఫ్‌ సెంచరీలు సాధించాడు.

ఆసీస్‌ భారీ స్కోరు:

ఆసీస్‌ భారీ స్కోరు:

ఆసీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. బర్న్స్‌ (18) నిరాశపరచగా.. వార్నర్‌ మాత్రం రాణించాడు. ఈ ఇద్దరి అనంతరం లబూషేన్‌-స్టీవ్‌ స్మిత్‌ల జోడి ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఒకవైపు స్మిత్‌ హాఫ్‌ సెంచరీ సాధించగా.. లబూషేన్‌ సెంచరీ సాధించాడు. ఈ టెస్టులో ఆసీస్‌ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలిరోజు ముగిసే సరికి ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. క్రీజులో లబూషేన్‌ (130), వేడ్ (22) ఉన్నారు.

Story first published: Friday, January 3, 2020, 13:31 [IST]
Other articles published on Jan 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+