For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వాళ్లు అన్నది నిజమే.. 400పరుగులతో రికార్డ్ నెలకొల్పిన అనంతరం బ్యాటర్ సామ్ నార్త్‌ఈస్ట్ స్పందన

 400Run Scorer Glamorgan Batter Sam NorthEast Says He Feels More Pressure in 190s Rather than 390s

32ఏళ్ల వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 400 పరుగులు చేసిన మొదటి బ్యాటర్‌గా కౌంటీ జట్టు గ్లామోర్గన్ బ్యాటర్ సామ్ నార్త్‌ ఈస్ట్ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లామోర్గాన్ మొదటి ఇన్నింగ్స్‌‌లో సామ్ నార్త్ఈస్ట్ 410పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇకపోతే ఈ మ్యాచ్ అనంతరం అతను మాట్లాడుతూ.. 390పరుగుల వద్ద ఉన్నప్పుడు కంటే 190లలో ఉన్నప్పుడే తాను మరింత టెన్షన్ పడ్డానని సామ్ నార్త్ఈస్ట్ చెప్పాడు. ఎందుకంటే తన కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించాలని తాను తీవ్రంగా కోరుకున్నానని, ఇన్నాళ్లుగా ఒక్క డబుల్ సెంచరీ కూడా చేయలేదనే ఫీలింగ్ వల్ల 190లలో ఉన్నప్పుడు చాలా టెన్షన్‌కు గురయ్యానని సామ్ పేర్కన్నాడు. ఇక అతని అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన వల్ల గ్రేస్ రోడ్‌లో జరిగిన మ్యాచ్‌లో గ్లామోర్గాన్ ఇన్నింగ్స్, 28పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇక సామ్ నార్త్‌ఈస్ట్ మాట్లాడుతూ.. 'నా కెరీర్లో 191పరుగులు చేయడమే నా హయ్యెస్ట్ స్కోరు. అందువల్ల ఈ మ్యాచ్‌లో నా స్కోరు 190 వద్ద ఉన్నప్పుడు నాకు విపరీతమైన టెన్షన్ వచ్చింది. 390లలో ఉన్నప్పుడు కూడా అంత టెన్షన్ పడలేదు. ఇప్పుడు దాని గురించి తలుచుకుంటే కూడా చాలా హాస్యంగా అన్పిస్తుంది. నేను సాధించాలనుకున్న దాని కంటే.. నాకు రెట్టింపు దక్కింది. ఇది ఎప్పటికీ జరగదని నేను అనుకున్నాను.' అని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నార్త్ఈస్ట్ పేర్కొన్నాడు. ఇకపోతే నార్త్ఈస్ట్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 12,000 పరుగుల మైలురాయికి చేరువయ్యాడు. అతను ఈ మైలురాయికి 34పరుగుల దూరంలో ఉన్నాడు. 'కొన్నేళ్ల నుంచి నా కోచ్‌లు నాతో అంటుండేవారు.. ఇప్పటికీ నీ నుంచి నీ సత్తా మేరకు ప్రదర్శన రాలేదని.. బహుశా ఈ ఇన్నింగ్స్ ద్వారా నా అసలైన సత్తా ఏంటో తెలిసింది.. వాళ్లన్నది నిజమే' అంటూ సామ్ పేర్కొన్నాడు.

ఇకపోతే లీసెస్టర్‌షైర్‌ వర్సెస్ గ్లామోర్గన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో లీసెస్టర్‌షైర్ 584పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన గ్లామోర్గన్ ఇంగ్రామ్ (139), సామ్ నార్త్ ఈస్ట్ (410), కుక్ (191నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో 5వికెట్లు కోల్పోయి 795పరుగులు చేసింది. తద్వారా 211పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో లీసెస్టర్ షైర్ 183పరుగులకే ఆలౌట్ కావడంతో గ్లామోర్గన్ ఇన్నింగ్స్ ప్లస్ 28పరుగుల తేడాతో గెలుపొందింది.

Story first published: Sunday, July 24, 2022, 18:19 [IST]
Other articles published on Jul 24, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+