నాలుగేళ్ల చిన్నారి బ్యాటింగ్ స్కిల్స్‌కి సోషల్ మీడియా ఫిదా (వీడియో)

హైదరాబాద్: ఒడిషాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ నాలుగేళ్ల పాప బ్యాటింగ్ చేస్తోన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. హుక్, పుల్, డ్రైవ్, కట్.. ఇలా అన్ని షాట్లను చాలా సునాయాసంగా బాదుతోంది. క్రీజులో ఆ చిన్నారి తీసుకున్న స్టాన్స్‌తో పాటు బంతిని ఎదుర్కొనేటప్పుడు ఫుట్ వర్క్ నిజంగా అద్భుతం.
చిన్న వయసు నుంచే భారత క్రికెటర్ల ఆటను చూసి బాగా ప్రేరణ పొందినట్లు ఉంది. ఆ చిన్నారి దూకుడుని చూసిన క్రికెటర్లు సైతం ఆమె ఆట అద్భుతమంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎప్పటికైనా భారత క్రికెట్ జట్టులో తప్పకుండా చోటు దక్కించుకుంటుందని క్రికెట్ విశ్లేషకులు సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆ చిన్నారి వీడియోని చూసిన ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా సైతం ఆ వీడియోని తన ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ ఆల్ ద బెస్ట్ చెప్పడం విశేషం.
Story first published: Tuesday, February 19, 2019, 18:04 [IST]
Other articles published on Feb 19, 2019
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications