Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒకటా.. రెండా: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి కారణాలివే

4 Reasons Why Sunrisers Hyderabad lost the match against Lucknow Super Giants In IPL 2022.

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఓడింది. ఇది రెండో ఓటమి. దీనితో పరాజయాల పరంపరకు తెర తీసినట్టే కనిపిస్తోంది. నవీముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించలేకపోయింది. 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 9వ తేదీన ఆడాల్సి ఉంది. ఓటముల్లో తనతో పోటీ పడుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీ కొట్టనుంది.

బౌలర్లు ఫర్వాలేదనిపించినా..

బౌలర్లు ఫర్వాలేదనిపించినా..

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌ 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కేప్టెన్ కేఎల్ రాహుల్-68, దీపక్ హుడా-51 చివర్లో ఆయుష్ బదోని మినహా లక్నో బ్యాటర్లలో ఎవరూ పెద్దగా రాణించలేదు. ఓపెనర్ కేఎల్ రాహుల్, మిడిలార్డర్‌లో దీపక్ హుడా 33 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో చేసిన 51 పరుగులు ఆ జట్టుకు ప్రధాన భాగస్వామ్యం. సన్‌రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రొమారియో షెప్పర్డ్, టీ నటరాజన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. రాజస్థాన్ రాయల్స్‌తో పోల్చుకుంటే- హైదరాబాద్ బౌలర్లు కొంత బెటర్ అనిపించారు.

బ్యాటర్ల వైఫల్యం..

బ్యాటర్ల వైఫల్యం..

బౌలర్లు ఫర్వాలేనిపించిన చోట.. బ్యాటర్లు చేతులెత్తేశారు. లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడ్డారు. 38 పరుగులకు ఓపెనర్లను కోల్పోయింది. కేప్టెన్ కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ జట్టుకు భారీ భాగస్వామ్యాన్ని అందించలేకపోయారు. కేన్-16, అభిషేక్ శర్మ-13 పరుగులు చేశారు. ఎయిడెన్ మార్క్‌రమ్ ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. ఉన్నంతలో రాహుల్ త్రిపాఠి-44, నికొలస్ పూరన్-34 పరుగులు చేసి.. ఫర్వాలేదనిపించుకున్నారు. ఆల్‌రౌండర్ గుర్తింపు పొందిన వాషింగ్టన్ సుందర్ పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాడు. ఫలితంగా 157 పరుగుల వద్దే నిలిచిపోయింది హైదరాబాద్ ప్రస్థానం.

అలాంటి భాగస్వామ్యాన్ని నెలకొల్పలేక..

అలాంటి భాగస్వామ్యాన్ని నెలకొల్పలేక..

లక్నో జెయింట్స్‌ 169 పరుగులు చేయడానికి ప్రధాన కారణం కేఎల్ రాహుల్-దీపక్ హుడా భాగస్వామ్యం. 27 పరుగులకే మూడు వికెట్లు పడిపోయిన దశ నుంచి 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించే స్థితికి చేరుకోవడంలో వీరిద్దరు కీలక పాత్ర పోషించారు. అలాంటి పార్ట్‌నర్‌షిప్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బ్యాటర్లు నెలకొల్పలేకపోయారు. సన్ రైజర్స్ బౌలర్లు వారిద్దరినీ విడగొట్టి ఉన్నా.. లేక అలాంటి భాగస్వామ్యాన్ని బ్యాటర్లు నెలకొల్పి ఉన్నా ఫలితం వేరుగా ఉండేదనడంలో సందేహాలు అక్కర్లేదు. రాహుల్ త్రిపాఠి-నికొలస్ పూరన్.. అలాంటి ప్రయత్నం చేశారు తప్ప.. దాన్ని విజయవంతంగా ముగించలేకపోయారు.

 నిలకడ లేమి వెంటాడుతూనే..

నిలకడ లేమి వెంటాడుతూనే..

సన్‌రైజర్స్ బ్యాటర్లకు నిలకడలేమి వేధిస్తూనే ఉంది. ఎయిడెన్ మార్క్‌రమ్ కిందటి మ్యాచ్‌లో రాణించాడు. అర్ధసెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 12 పరుగులతో సరిపెట్టుకున్నాడు. నికొలస్ పూరన్‌దీ అదే పరిస్థితి. రాజస్థాన్ రాయల్స్‌పై విఫలమైన రాహుల్ త్రిపాఠి, నికొలస్ పూరన్.. ఈ మ్యాచ్‌లో బ్యాట్ ఝళిపించగలిగారే గానీ.. దాన్ని భారీ భాగస్వామ్యంగా మలచుకోలేదు. లోయర్ ఆర్డర్‌లో వాషింగ్టన్ సుందర్-రొమారియో షెప్పర్డ్ ఇంకొంత సేపు క్రీజ్‌లో ఉన్నా బాగుండేదనిపించింది. అబ్దుల్ సమద్ మరోసారి నిరుత్సాహ పరిచాడు. సున్నా పరుగులకే వెనుదిరిగాడు.

Story first published: Tuesday, April 5, 2022, 8:57 [IST]
Other articles published on Apr 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+