
భారీ స్కోర్‌తో దడదడ
ఫుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కెప్టెన్ సంజు శాంసన్-55, దేవ్‌దత్ పడిక్కల్-41, జోస్ బట్లర్-35, షిమ్రోన్ హెట్‌మైర్- 32 పరుగులు చేశారు. వీరందరి స్ట్రైక్ రేట్ 125 నుంచి 246 వరకు రికార్డయింది. సన్‌రైజర్స్ బౌలర్లు ఉమ్రాన్ మలిక్, టీ నటరాజన్ రెండు చొప్పున, భువనేశ్వర్ కుమార్, రొమారియో షెప్పర్డ ఒక్కో వికెట్ పడగొట్టారు.

బౌలింగ్ ఫెయిల్యూర్..
సన్‌రైజర్స్‌లో కాస్తో, కూస్తో ఫర్వాలేదనిపించుకునే బౌలింగ్ డిపార్ట్‌మెంట్- ఈ మ్యాచ్‌లో చేతులెత్తేసింది. 210 పరుగుల భారీ స్కోర్‌ను చేసే అవకాశాన్ని ప్రత్యర్థికి ఇచ్చిందంటే బౌలర్లు ఎంత నాసిరకంగా బంతులను సంధించారో అర్థం చేసుకోవచ్చు. 14 పరుగులను ఎక్స్‌ట్రాల రూపంలో ప్రత్యర్థి జట్టు ఖాతాలో వేశారు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ బౌలర్లు మరింత రాటు దేలి- ప్రత్యర్థిని కట్టడి చేయాల్సింది పోయి.. తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. నో బాల్స్, వైడ్స్ వేశారు.

బౌలర్లు సమష్టిగా
సన్‌రైజర్స్ బౌలర్లు సమష్టిగా విఫలం అయ్యారు. సీనియర్ భువనేశ్వర్ కుమార్, రొమారియో షెప్పర్డ్ ఉన్నంతలో ఫర్వాలేదనిపించుకున్నారు. నాలుగు ఓవర్లు వేసిన భువి 29 పరుగులు ఇచ్చి.. ఓ వికెట్ తీసుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో షెప్పర్డ్ ఒక వికెట్ పడగొట్టి 33 పరుగులు ఇచ్చాడు. ఉమ్రాన్ మలిక్, టీ నటరాజన్ రెండు చొప్పున వికెట్లు తీసుకున్నా ధారాళంగా పరుగులు ఇచ్చారు.

బౌలర్‌గా వాషింగ్టన్ సుందర్ విఫలం..
బ్యాటింగ్‌లో మెరుపులు మెరిసించిన వాషింగ్టన్ సుందర్.. బౌలర్‌గా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. తన నాలుగు ఓవర్ల కోటాను కూడా పూర్తి చేయలేకపోయాడు. మూడు ఓవర్లల్లో 47 పరుగులు ధారదాత్తం చేశాడు. మిగిలిన ఆ ఒక్క ఓవర్‌ను వేసిన అభిషేక్ శర్మ.. సుందర్‌తో పోటీ పడినట్టు కనిపించాడు. అతనికి ఏ మాత్రం తగ్గకుండా ఆ ఒక్క ఓవర్‌లోనే 15 పరుగులు సమర్పించుకున్నాడు. వికెట్లను పడగొట్టలేకపోయారీ ఇద్దరు.

బ్యాటర్లు తక్కువేమీ కాదు..
సన్‌రైజర్స్ పరాజయంలో బ్యాటర్ల పాత్ర కూడా తక్కువేమీ కాదు. బౌలింగ్ విభాగం విఫలమైన చోట కనీసం బ్యాటింగ్‌లో అయినా రాణించలేకపోయారు. కేన్ విలియమ్సన్-2, అభిషేక్ శర్మ-9, రాహుల్ త్రిపాఠి-0, నికొలస్ పూరన్-0, అబ్దుల్ సమద్-4, భువనేశ్వర్ కుమార్-3.. ఇలా సాగింది బ్యాటింగ్ శైలి. మిడిలార్డర్‌లో ఎయిడెన్ మార్క్‌రమ్-57, లోయర్ ఆర్డర్‌లో వాషింగ్టన్ సుందర్-40, రొమారియో షెప్పర్డ్-24 మినహా మరెవరూ సింగిల్ డిజిట్‌ను దాటలేకపోయారు.

బౌలర్లు విఫలం..
బౌలర్లు విఫలం అయ్యారనే విషయాన్ని కేప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా అంగీకరించాడు. బౌలర్లు నో బాల్స్ వేయడం జట్టుపై ఒత్తిడిని పెంచిందని చెప్పాడు. లాజికల్‌గా కొన్ని తప్పిదాలు చోటు చేసుకున్నాయని, బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ను ఇంప్రూవ్ చేసుకుంటామని అన్నాడు. టీ20 ఫార్మట్‌లో ఎక్స్‌ట్రా రన్స్ అత్యంత విలువైనవని, ఏ జట్టయినా వాటిని నియంత్రించుకోవాల్సి ఉంటుందని, తాము అదే చేస్తామని వ్యాఖ్యానించాడు. బౌలింగ్ విభాగంలో ఉన్న లోపాలను గుర్తించి, సరి చేసుకుంటామని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications

