
మూడు వికెట్లకే..
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో 169 పరుగులను చేసింది. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది. జోస్ బట్లర్ మరోసారి చెలరేగిపోయాడు. 47 బంతుల్లో ఆరు సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. దేవ్‌దత్ పడిక్కల్-37 పరుగులు చేశాడు. చివర్లో షిమ్రోన్ హెట్మెయిర్ విజృంభణ తోడు కావడంతో రాజస్థాన్ భారీ స్కోర్ సాధించింది. తన ప్రత్యర్థికి 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.

దినేష్ కార్తీక్-షాబాజ్ అహ్మద్ మెరుపులు
రాయల్ ఛాలెంజర్స్ 19.1 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 173 పరుగులు చేసింది. ఓటమి తప్పదనుకున్న దశలో ఆర్సీబీ అద్భుతంగా బౌన్స్ బ్యాక్ అయింది. వికెట్ కీపర్ దినేష్ కార్తీక్-షాబాజ్ అహ్మద్ పోటీ పడి పరుగులు సాధించారు. రాజస్థాన్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఆరవ వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. షాబాజ్ అవుట్ అయినా- అప్పటికే గెలుపు ఖాయం కావడంతో బెంగళూరు బెంగ తీరిపోయింది.

ఆ ఇద్దరే..
బెంగళూరు ఖాతాలో మరో ఓటమి తప్పదనుకున్న స్థితి నుంచి విజయం అందుకోనేస్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం దినేష్ కార్తీక్-షాబాజ్ ద్వయమే. 12.3 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసిన దశలో ప్రారంభమైన ఈ ఇద్దరి భాగస్వామ్యం జట్టును విజయానికి చేరువగా తీసుకెళ్లింది. 17.5వ ఓవర్ వద్ద షాబాజ్ అహ్మద్ అవుట్ అయ్యాడు. ఇంకా రెండు ఓవర్లు చేతిలో ఉండటం గెలవడానికి 15 పరుగుల దూరంలో ఉండటం, దినేష్ కార్తీక్ దూకుడు మీదుండటం వల్ల గెలుపు సులువైంది.

ముంచిన అశ్విన్..
స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వేసిన 14వ ఓవర్ రాజస్థాన్ రాయల్స్‌కు మ్యాచ్‌ను దూరం చేసింది. ఆ ఓవర్ మూడో బంతిని ఫైన్ లెగ్ దిశగా బౌండరీ తరలించాడు. అది నో బాల్ కావడంతో వల్ల లభించిన ఫ్రీ హిట్‌ను సద్వినియోగం చేసుకున్నాడు. దాన్ని సిక్సర్‌గా మలిచాడు. ఆ వెంటనే మరో మరో రెండు బౌండరీలు బాదాడు. ఫలితంగా ఆ ఓవర్‌లో 21 పరుగులు లభించాయి. మ్యాచ్ మొత్తం రాయల్ ఛాలెంజర్స్ వైపు మొగ్గింది. ఆ తరువాత కూడా అదే దూకుడును కొనసాగించారు. ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో భారీగా పరుగులు రాబట్టుకున్నారు.


Click it and Unblock the Notifications
