For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మ పరువు పోయిందిగా: చెన్నై సూపర్ కింగ్స్‌పై ఓటమికి కారణాలివే

4 Reasons Why Mumbai Indians lost the match against CSK in IPL 2022

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తన వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. మరో గెలుపును అందుకుంది. ఈ సీజన్‌లో ఇది రెండో విజయం మాత్రమే. నవీముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. దీనితో రోహిత్ సేన ఓ కొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌లల్లోనూ ఘోరంగా ఓడింది. ఇదివరకు ఈ రికార్డ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు మీద ఉండేది. ఆ టీమ్ వరుసగా ఆరింట్లో ఓడింది.

మారని కథ

మారని కథ

ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ తీరు ఏ మాత్రం మారలేదు.. మెరుగుపడనూ లేదు. ఓపెనర్లు మరోసారి ఘోరంగా విఫలం అయ్యారు. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లను కోల్పోయింది. అది కూడా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌ రూపంలో. రెండో బంతికి రోహిత్ శర్మ, అయిదో బంతికి ఇషాన్ కిషన్ బలి అయ్యారు. వారిద్దరిదీ డకౌట్లే. ముఖేష్ చౌదరి వేసిన ఓవర్ అది. ఫస్ట్ డౌన్ డెవాల్డ్ బ్రెవిస్ సైతం రాణించలేకపోయాడు. నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. టాప్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్. ఫలితంగా ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో చేతులెత్తేసింది.

మిడిల్ ఆర్డర్‌పై భారం..

మిడిల్ ఆర్డర్‌పై భారం..

టాప్ ఆర్డర్ విఫలం కావడంతో బ్యాటింగ్ భారం మొత్తాన్ని మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు మోయాల్సి వచ్చింది. సూర్యకుమార్ యాదవ్, హైదరాబాదీ తిలక్ వర్మ, హృతిక్ షోకీన్ ఇన్నింగ్‌ను నిలబెట్టారు. తిలక్ వర్మ భారీ ఇన్నింగ్ ఆడాడు. 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సర్, మూడు ఫోర్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ మరోసారి 30 ప్లస్ స్కోర్ చేశాడు. 21 బంతుల్లో 32 పరుగులు సాధించాడు. హృతిక్ షోకీన్ 25 బంతుల్లో మూడు ఫోర్లతో 25 పరుగులు చేశాడు.

ముగ్గురితోనే..

ముగ్గురితోనే..

ఈ ముగ్గురు తప్ప మిగిలిన బ్యాటర్లెవరూ రాణించలేదు. ఉన్నంతలో కీరన్ పొల్లార్డ్, జయదేవ్ ఉనద్కత్ కాస్త భారీ షాట్లకు ప్రయత్నించారు. పొల్లార్డ్ క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయాడు. 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. కీలకమైన డెత్ ఓవర్లలో అతను అవుట్ కావడంతో ముంబై ఇన్నింగ్‌కు సడన్ బ్రేకులు పడినట్టయింది. పొల్లార్డ్ కుదురుకుని ఉంటే భారీ స్కోర్ చేయడానికి అవకాశం దక్కేది. ఉనద్కత్ తొమ్మిది బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 19 పరుగులు చేయడం కొంత బెటర్.

 బుమ్రా వికెట్ లెస్..

బుమ్రా వికెట్ లెస్..

జట్టు ఓటమి పాలుకావడానికి ముంబై ఇండియన్స్ బౌలర్లు తమవంతు కృషి చేశారు. డేనియల్ సామ్స్, ఉనద్కత్, రిలే మెరెడిత్ మినహా మరెవరూ వికెట్లను తీసుకోలేకపోయారు. సామ్స్ నాలుగు వికెట్లకు 30 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. జస్‌ప్రీత్ బుమ్రా ఫామ్‌ను కోల్పోయాడనేది మరోసారి రుజువైంది. ఈ మ్యాచ్‌లో వికెట్ లెస్ అయ్యాడు. ఉనద్కత్ రెండు వికెట్లు తీసుకున్నా.. భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. హృతిక్ షోకీన్ ఫర్వాలేదనిపించుకున్నాడు.

చివరి ఓవర్‌లో..

చివరి ఓవర్‌లో..

చివరి ఓవర్‌లో చోటు చేసుకున్న డ్రమటిక్ సిట్యువేషన్స్.. ముంబై ఇండియన్స్‌ను మట్టి కరిపించాయి. 6 బంతుల్లో 17 పరుగులు చేయాల్సిన దశ అది. క్రీజ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఉండటంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆశలు సడల్లేదు గానీ.. ముంబై ఇండియన్స్ బౌలింగ్‌ కట్టుతప్పింది. ఆ ఓవర్ తొలి బంతికి వికెట్ పడగొట్టినప్పటికీ.. పరుగులను కట్టడి చేయలేకపోయింది. చివరి నాలుగు బంతుల్లో ధోనీ 6,4,2,4 పరుగులు సాధించడంతో ముంబై పరాజయం పరిపూర్ణమైంది.

ముంబై పరిస్థితేంటీ..?

ముంబై పరిస్థితేంటీ..?

ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు గెలుపు రుచి చూడలేదు. ఆడిన ఏడింట్లోనూ పరాజయాలే ఎదురయ్యాయి. ఇకపై గెలుస్తుందనే గ్యారంటీ లేదు. గెలిచినా.. టైటిల్ రేసులో ఉంటుందనే నమ్మకమూ కోల్పోయింది. ఇంకో ఏడు మ్యాచ్‌లను ఆడాల్సి ఉందా జట్టుకు. తన తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు వాంఖెడె స్టేడియంలో ఈ మ్యాచ్ ఉంటుంది. గెలిచినా పెద్దగా ఉపయోగపడకపోవచ్చు.

Story first published: Friday, April 22, 2022, 9:02 [IST]
Other articles published on Apr 22, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+