
ఆరంభంలోనే శూరత్వం..
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు ఆరంభంలో మాత్రమే శూరత్వాన్ని చూపగలిగారు. ఆ పెర్మార్మ్‌ను చివరి వరకూ కొనసాగించలేకపోయారు. ఏడు పరుగులకు రెండు వికెట్లను కూల్చినప్పటికీ- రాయల్ ఛాలెంజర్స్ బ్యాటర్లు జట్టు స్కోరును 181 పరుగులకు తీసుకెళ్లగలిగారంటే అది బౌలర్ల వైఫల్యమే. రాయల్ ఛాలెంజర్స్ ఓపెనర్ అనూజ్ రావత్‌ను తొలి ఓవర్‌లోనే వెనక్కి పంపారు లక్నో బౌలర్లు.

ఫాఫ్‌ను అవుట్ చేయడంలో విఫలం..
రెండో ఓవర్‌లో విరాట్ కోహ్లీదీ అదే పరిస్థితి. ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యాడు కింగ్ కోహ్లీ. ఆ దశలో బెంగళూరు ఇంత భారీ స్కోర్ చేస్తుందని ఎవరూ ఊహించివుండరు. క్రమంగా వికెట్లను తీసుకుంటున్నప్పటికీ.. మరో ఎండ్‌లో పాతుకుపోయి భారీ షాట్లు ఆడుతున్న కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను అవుట్ చేయలేకపోయారు లక్నో బౌలర్లు. దీనికి అవసరమైన వ్యూహాలను పన్నలేకపోయింది. తొలి ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగిన డుప్లెసిస్.. చివరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు. అతనిపై ఎలాంటి ఒత్తిడిని కూడా తీసుకుని రాలేకపోయారు. ఫలితంగా స్వేచ్ఛగా షాట్లు బాదాడు.

రెండు విభాగాల్లోనూ తప్పిదాలు..
బౌలింగ్, బ్యాటింగ్‌లో లక్నో జెయింట్స్ చేసిన కొన్ని తప్పిదాలు ఆ జట్టు ఓటమికి కారణం అయ్యాయి. డుప్లెసిస్‌ను కట్టడం చేయకపోవడం వల్ల చివరి ఓవర్లల్లో భారీగా పరుగులను సమర్పించుకుంది. చివరి అయిదు ఓవర్లలో 50 పరుగులు ఇచ్చింది. చివరి ఓవర్‌లో బ్యాటర్లను కట్టడి చేసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కనీసం 15 నుంచి 20 పరుగులు ఎక్కువగా ఇచ్చుకున్నామని కేప్టెన్ కేఎల్ రాహుల్ సైతం అంగీకరించాడు.

180కి పైగా స్కోర్ చేయలేక
బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న పిచ్‌పై 180కి పైగా పరుగులను ఛేదించాల్సి రావడం లక్నో జట్టుకు భారంగా మారింది. భారీ స్కోర్‌ను ఛేదించడంలో బ్యాటింగ్ ఆర్డర్ విఫలమైంది. ఓపెనర్ క్వింటన్ డికాక్-3, మనీష్ పాండే-6, దీపక్ హుడా-13, ఆయుష్ బదోనీ-13, జేసన్ హోల్డర్-16.. ఇదీ లక్నో బ్యాటర్ల స్కోర్. పించ్ హిట్టర్‌గా పేరున్న మార్కస్ స్టోయినిస్ కూడా భారీ షాట్లను ఆడలేకపోయాడు. క్రీజ్‌లో దిగిన తరువాత కొద్దిసేపు నింపాదిగా ఆడాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో గేర్ మార్చినట్టు కనిపించినప్పటికీ.. ఆ వెంటనే అవుట్ కావడం జట్టుకు ఉన్న కొద్దో గొప్పో విజయావకాశాలను దెబ్బతీసింది.

అంపైర్ నిర్ణయం కూడా..
అంపైర్ నిర్ణయం కూడా లక్నో జెయింట్స్ ఓటమికి ఓ కారణం. హేజిల్‌వుడ్ వేసిన 19వ ఓవర్ తొలి బంతి క్లీన్ వైడ్‌గా వెళ్లింది. అయినా దాన్ని వైడ్‌గా ఇవ్వలేదు అంపైర్. ఆ ఓవర్‌ను ఎదుర్కొన్న మార్కస్ స్టొయినిస్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఆ మరుసటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లక్నో జెయింట్స్‌కు ఉన్న చిట్టచివరి ఆశ స్టోయినిస్ ఒక్కడే. అతను అవుట్ కాకపోయి ఉంటే రన్‌రేట్ ఈక్వేషన్స్ అంత భారీగా ఉండేవి కావు.


Click it and Unblock the Notifications
