
బ్యాటర్ల వీర విహారం..
ముంబై వాంఖెడె స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ దుమ్ము దులిపారు. ప్రత్యేకించి డీకే బ్యాటింగ్ దిమ్మతిరిగేలా చేసింది ఢిల్లీ బౌలర్లను. 34 బంతుల్లో అయిదు ఫోర్లు, అయిదు సిక్సర్లతో 66 పరుగులు చేశాడీ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్. మిడిలార్డర్‌లో మ్యాక్సీ 34 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 55, షాబాజ్ అహ్మద్ 21 బంతుల్లో 32 పరుగులతో సత్తా చాటారు.

ప్రారంభంలో వికెట్లు కూల్చినా..
ప్రారంభ ఓవర్లల్లో తడాఖా చూపిన ఢిల్లీ కేపిటల్స్ బౌలర్లు.. ఆ తరువాత చేతులెత్తేశారు. వికెట్‌లెస్‌గా తయారయ్యారు. చివరి ఎనిమిది ఓవర్లల్లో ఒక్క వికెట్‌ను పడగొట్టలేకపోయారంటే వారి బౌలింగ్ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రారంభ ఓవర్లల్లో వికెట్లను తీసుకున్నప్పటికీ.. ఆ తరువాత అదే ఒత్తిడిని కొనసాగించలేకపోయారు. జట్టు స్కోరు అయిదు పరుగుల వద్దే తొలి వికెట్‌ను కూల్చారు ఢిల్లీ బౌలర్లు. అనూజ్ రావత్ డకౌట్, ఫాఫ్‌ను కూడా త్వరగానే పెవిలియన్ పంపించారు. అయినప్పటికీ.. బెంగళూరు స్కోరు 199 దాకా వెళ్లిందంటే అది బౌలర్ల ఫెయిల్యూరే.

8 ఓవర్లల్లో నో వికెట్..
రాయల్ ఛాలెంజర్స్ ఇన్నింగ్‌లో చివరి వికెట్ 11.2 ఓవర్ వద్ద పడింది. కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ అయిదో వికెట్‌గా అవుట్ అయ్యాడు. ఇక ఆ తరువాత ఒక్క వికెట్ కూడా పడలేదు. కుల్‌దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్ భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్ వంటి టీ20 స్పెషలిస్ట్ బౌలర్లు ఉన్నప్పటికీ.. బెంగళూరు బ్యాటర్లను ఏ మాత్రం ఒత్తిడిలోకి నెట్టలేకపోయారు. షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ విజృంభణకు తల వంచారు.

దుమ్ము దులిపిన డీకే..
దినేష్ కార్తీక్ దుమ్ము దులిపాడు. ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో కొనసాగిస్తోన్నాడు. డెత్ ఓవర్లల్లో అనూహ్యమైన స్ట్రైక్ రేట్‌ను నమోదు చేస్తోన్నాడు. 194.11 స్ట్రైక్ రేట్‌తో ఢిల్లీ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. 34 బంతుల్లో అయిదు ఫోర్లు, అయిదు సిక్సర్లతో 66 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటిదాకా ఆడిన మ్యాచ్‌లల్లో ఒక్కసారి మాత్రమే అవుట్ కావడం.. అతని ఫామ్‌కు అద్దం పడుతోంది. డీకేను త్వరగా అవుట్ చేసి ఉంటే- ఢిల్లీకి 190 పరుగుల టార్గెట్ ఛేదించాల్సిన అవసరం వచ్చేది కాదు.

నిలదొక్కుకోలేని ఢిల్లీ బ్యాటర్లు..
భారీ లక్ష్యాన్ని ఛేదించే విషయంలో ఢిల్లీ బ్యాటర్లు తడబడ్డారు. డేవిడ్ వార్నర్ ఒక్కడే పోరాడాడు. కేప్టెన్ రిషభ్ పంత్ 17 పరుగులతో 34 పరుగులు చేసి.. అతనికి అండగా నిలిచే ప్రయత్నం చేశాడు గానీ అది మంచి రిజల్ట్ ఇవ్వలేదు. పృథ్వీ షా, మిఛెల్ మార్ష్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. మిడిల్, లోయర్ ఆర్డర్ మళ్లీ విఫలమైంది. రౌమన్ పావెల్‌ది గోల్డెన్ డక్. లలిత్ యాదవ్‌దీ దాదాపు అదే పరిస్థితి. శార్దుల్ ఠాకూర్ ఉన్నంతలో ఫర్వాలేదనిపించుకున్నాడు గానీ చివరి వరకూ నిలవలేకపోయాడు. అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్ చేసిన పోరాటం సరిపోలేదు.


Click it and Unblock the Notifications
