
కుదురుకోలేని డేవిడ్ వార్నర్..ధాటిగా ఆడిన షా
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 149 పరుగులను చేసింది. ఓపెనర్ పృథ్వీ షా రెచ్చిపోయాడు. లక్నో బౌలర్లను దంచి కొట్టాడు. 34 బంతుల్లో రెండు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లతో 61 పరుగులు చేశాడు. మరో ఓపెనర్.. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన డేవిడ్ వార్నర్ నిరాశ పరిచాడు.
అతని బ్యాటింగ్ ఇంకా గాడిన పడలేదు. 12 బంతుల్లో నాలుగు పరుగులు చేసి, రవి బిష్ణోయ్ చేతిలో అవుట్ అయ్యాడు. రౌమన్ పావెల్ కూడా రాణించలేదు.. మిడిలార్డర్‌లో రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారే తప్ప.. లక్నో ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో విఫలం అయ్యారు.

రిషభ్ పంత్ కట్టడి..
అనంతరం బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 155 పరుగులు చేసింది. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారీ షాట్లకు పెట్టింది పేరయిన రిషభ్ పంత్ చివరి వరకు క్రీజ్‌లో ఉన్నప్పటికీ.. లక్నో బౌలర్లు అతణ్ని కట్టడి చేయగలిగారు. స్వేచ్ఛగా షాట్లను ఆడే పరిస్థితిని కల్పించలేదు. 36 బంతుల్లో 39 పరుగులు చేశాడు పంత్. సర్ఫరాజ్ ఖాన్ పరిస్థితి దాదాపు అంతే.

లక్నో బౌలర్లు సూపర్
బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్ చేశారు. అవేష్ ఖాన్, ఆండ్రూ టై మాత్రమే భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. జేసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్యా బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ధనాధన్ ఫార్మట్‌లో కృష్ణప్ప గౌతమ్ ఓ మెయిడెన్ ఓవర్ కూడా వేశాడంటే.. క్రీజ్‌లో బ్యాటర్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒక్క పృథ్వీ షా మాత్రమే ధాటిగా ఆడగలిగాడు. అతను అవుట్ అయిన తరువాత వచ్చిన బ్యాటర్లెవరూ ఆ స్థాయిలో ఆడలేదు.

క్వింటన్.. వెల్‌డన్
లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఒడిదుడుకులకు గురయింది. 149 పరుగులను అందుకోవడానికి చివరి ఓవర్ వరకూ ఆడాల్సి వచ్చింది. పైగా ఆ ఓవర్‌లో వికెట్‌ను సైతం కోల్పోయింది. ఢిల్లీ బౌలర్లు ముస్తాఫిజుర్ రెహ్మాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్.. బౌలింగ్‌లో సత్తా చాటారు. అక్షర్ పటేల్ రెండు ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. లలిత్ యాదవ్, ముస్తాఫిజుర్ పొదుపుగా బౌలింగ్ చేశారు. ఢిల్లీ విజయానికి క్వింటన్ డికాక్ మాత్రమే అడ్డుగా నిలిచాడు. 52 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్ లేకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.


Click it and Unblock the Notifications
