Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జా..జా.. జడేజా: చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ పరాజయానికి కారణాలివే

4 Reasons Why Chennai Super Kings lost the match against Punjab Kings In IPL 2022.

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ మరో ఓటమిని మూటగట్టుకుంది. హ్యాట్రిక్ పరాజయాలను చవి చూసింది. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది ఈ టీమ్.. ఆ స్థాయిలో ఆడట్లేదు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా బోణీ కొట్టనే లేదు. ఆడిన తొలి రెండు మ్యాచ్‌లల్లోనూ ఘోర పరాజయాలను చవి చూసింది. తొలి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్..రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఇప్పుడు తాజాగా పంజాబ్ కింగ్స్ చేతుల్లో పరాభవం పొందింది. చెన్నై తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 9వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడాల్సి ఉంది.

ఆడింది ఆ ముగ్గురే..

ఆడింది ఆ ముగ్గురే..

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్- చెన్నై ముందు 181 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై బ్రబౌర్న్ స్టేడియంలో లియామ్ లివింగ్‌స్టోన్ ఓ మినీ సునామీని సృష్టించాడు. 32 బంతుల్లో అయిదు ఫోర్లు, అయిదు సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. శిఖర్ ధవన్-33, జితేష్ శర్మ-26 బ్యాట్‌ను ఝుళిపించడంతో 180 పరుగులు చేయగలిగింది. ఈ ముగ్గురు కలిసి తమ జట్టుకు భారీ స్కోర్‌ను అందించారు. చెన్నై బౌలర్లలో క్రిస్ జోర్డాన్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. రెండు వికెట్లు పడగొట్టి 23 పరుగులే ఇచ్చాడు. ముఖేష్ చౌధరి తన వైఫల్యాన్ని కంటిన్యూ చేశాడు.

36 పరుగులకే సగం బ్యాటర్లు పెవిలియన్ దారి

36 పరుగులకే సగం బ్యాటర్లు పెవిలియన్ దారి

భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నై ఏ దశలోనూ ప్రతిఘటించలేకపోయింది. 36 పరుగులకే సగం మంది బ్యాటర్లు పెవిలియర్ దారి పట్టారంటే- వారు ఎంత అధ్వాన్నంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్లు రాబిన్ ఉతప్ప-13, రుతురాజ్ గైక్వాడ్-1, మొయిన్ అలీ-0, అంబటి రాయుడు-13, రవీంద్ర జడేజా-0..ఘోరంగా విఫలం అయ్యారు. మిడిల్ ఆర్డర్‌లో శివం దుబే హాఫ్ సెంచరీ, ఎంఎస్ ధోనీ 23 పరుగుతో ఆదుకొని ఉండకపోతే మరింత దయనీయంగా తయారై ఉండేది చెన్నై స్థితి. 18 ఓవర్లల్లో 126 పరుగులకు చాప చుట్టేసింది.

రవీంద్ర జడేజా మళ్లీ..

రవీంద్ర జడేజా ఇంకా గాడిన పడలేదు. బ్యాటింగ్, బౌలింగ్.. విభాగాల్లో ఫ్లాప్ షోను కంటిన్యూ చేశాడీ మ్యాచ్‌లో కూడా. డకౌట్ అయ్యాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఆరో ఓవర్ మూడో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 23 పరుగులే. కొద్దిసేపయినా క్రీజ‌్‌లో కుదురుకోలేకపోయాడు. బౌలింగ్‌లో అతని ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. తొలిసారిగా తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేయడం ఒక్కటే హైలైట్. నాలుగు ఓవర్లల్లో 34 పరుగులు ఇఛ్చి, విధ్వంసాన్ని సృష్టిస్తోన్న లియామ్ లివింగ్‌స్టోన్‌ను అవుట్ చేశాడు. మూడు మ్యాచ్‌ల తరువాత రవీంద్ర జడేజాకు దక్కిన ఒకే ఒక్క వికెట్ ఇది.

అందివచ్చిన అవకాశాన్ని చేతులారా..

అందివచ్చిన అవకాశాన్ని చేతులారా..

చెన్నై బౌలర్లలో క్రిస్ జోర్డాన్ ఒక్కడే బెటర్‌ అనిపించాడు. ఈ సీజన్‌లో అతనికి ఇదే తొలి మ్యాచ్. పొదుపుగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. భానుక రాజపక్స్ బౌలింగ్‌లో భాగస్వామ్యం వహించాడు. ముఖేష్ చౌధరి తన వైఫల్యాన్ని కంటిన్యూ చేశాడు. దీపక్ చాహర్, ఆడమ్ మిల్నె అందుబాటులో లేకపోవడం వల్ల అందివచ్చిన అవకాశాన్ని అతను ఏ మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఈ మ్యాచ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. నాలుగు ఓవర్లల్లో 52 పరుగులు ఇచ్చుకున్నాడు. పంజాబ్ కింగ్స్ కేప్టెన్ మయాంక్ అగర్వాల్‌ను అవుట్ చేశాడు.

ఓపెనర్ల మధ్య..

ఓపెనర్ల మధ్య..

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ల వైఫల్యం కూడా ఈ పరాజయానికి కారణమైంది. రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప భారీ భాగస్వామ్యాన్ని అందించలేదు. 181 పరుగులు చేయాల్సిన దశలో ఓపెనర్లు విఫలం కావడం అంటే.. ఓటమిని కొని తెచ్చుకున్నట్టే. గైక్వాడ్ ఈ మ్యాచ్‌లోనూ స్కోరింగ్ షాట్స్ ఆడలేకపోయాడు. ఓపెనింగ్ జంట భారీ భాగస్వామ్యాన్ని అందించకపోవడం మైనస్ పాయింట్. రుతురాజ్ గైక్వాడ్ ఘోరంగా విఫలం అయ్యాడు. ఊతప్ప, గైక్వాడ్, మొయిన్ అలీ, జడేజాల్లో ఏ ఒక్కరు క్రీజ్‌లో కుదురుకుని ఉన్నా.. కాస్తయినా ప్రతిఘటించడానికి అవకాశం ఉండేది.

Story first published: Monday, April 4, 2022, 8:06 [IST]
Other articles published on Apr 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+