Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్థాన్ జాతీయ గీతం పాడినందుకు నలుగురు కాశ్మీరీ క్రికెటర్ల అరెస్టు

4 Cricketers In Jammu And Kashmir Arrested For 'Respecting' Pakistan National Anthem

హైదరాబాద్: భారతీయులు అందులోనూ దేశంలో అతి ఎక్కువ మంది ఫాలో అవుతున్న క్రీడాకారులు, క్రికెటర్లు అయినటువంటి నలుగురిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ జాతీయగీతాన్ని గౌరవించినందుకు గాను వారిని ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన జమ్మూ కశ్మీర్లోని బండీపూర జిల్లాలో జనవరి 3న చోటు చేసుకుంది.

అరిన్ గ్రామంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు ముందు ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు రెండు వరుసల్లో నిలబడ్డారు. సరిగ్గా అదే సమయంలో లౌడ్ స్పీకర్లలో పాక్ జాతీయగీతం వస్తుంది. అది విన్న వెంటనే వారు వెంటనే తల పైకెత్తి నిలబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో ఆ నలుగురిని అరెస్టు చేశారు. అనంతరం ఇరు జట్లపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మ్యాచ్ నిర్వాహకుల కోసం ఆరా తీస్తున్నామని బండీపుర సీనియర్ ఎస్పీ షేక్ జుల్ఫికర్ ఆజాద్ తెలిపారు.

2016లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కాశ్మీర్‌కు చెందిన క్రికెటర్లు క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు లైన్లో నిల్చోని పాక్ జాతీయగీతం ఆలపించారు. అనంతరం వారిని తల్లిదండ్రుల పూచికత్తు మీద విడిచిపెట్టారు.
సినిమా థియేటర్లలో భారత జాతీయగీతం ఆలపిస్తుండగా.. లేచి నిల్చోకపోవడంతో సైబరాబాద్ పోలీసులు కాశ్మీర్‌కు చెందిన యువతను గత ఏడాది అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 8, 2018, 17:01 [IST]
Other articles published on Jan 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+