పాండ్యా రికార్డుల మోత: ట్విట్టర్‌లో ప్రశంసల హోరు
హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేయడం ఇక లాంఛనంగా కనిపిస్తోంది. పల్లెకెలె వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లీసేన వైట్‌వాష్ దిశగా సాగుతోంది. టీమిండియాను కట్టడి చేయొచ్చన్న ఆశతో రెండో రోజును ఆరంభించిన శ్రీలంకను సెంచరీతో హార్దిక్ పాండ్యా దెబ్బతీశాడు.
అంతేకాదు అరంగేట్రం టెస్టు సిరీస్‌లోనే సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. కొలంబో వేదికగా రెండో టెస్టులో హాఫ్ సెంచరీ చేసిన అతడు మూడో టెస్టులో భారీ సిక్సర్లు, బౌండరీలతో శ్రీలంక బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. 96 బంతుల్లోనే 8 బౌండరీలు, 7 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశాడు.
తద్వారా తన తొలి ఫస్ట్‌క్లాస్ సెంచరీని టెస్టు క్రికెట్లో చేసిన ఐదో భారత ఆటగాడిగా పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు పాండ్యా అత్యధికి స్కోరు 90గా ఉంది. సెంచరీ కోసం పాండ్యా ఆడిన బంతులు 86. విదేశీ గడ్డపై ఓ భారత బ్యాట్స్‌మన్‌కు ఇది రెండో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం.
78 బంతుల్లో వెస్టిండిస్‌పై సెహ్వాగ్ సెంచరీ చేశాడు. పాండ్యా తన ఇన్నింగ్స్‌లో వరుసగా మూడు సిక్సులు బాదాడు. దీంతో కపిల్‌దేవ్, ధోని తర్వాత టెస్టుల్లో వరుసగా మూడు సిక్స్‌లు కొట్టిన మూడో భారత బ్యాట్స్‌మన్ నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో లంక బౌలర్ పుష్పకుమార వేసిన ఓ ఓవర్లో పాండ్యా 26 పరుగులు పిండుకున్నాడు.
తద్వారా టెస్టుల్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా పాండ్యా నిలిచాడు. కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 487 పరుగులు చేయగా శ్రీలంక 135 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది. పాండ్యా సూపర్ ఇన్నింగ్స్‌పై మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
వీరేంద్ర సెహ్వాగ్
వావ్! హార్దిక్ పాండ్యా అద్భుత సెంచరీ. నా కుంగ్‌ఫూ పాండ్యా వెల్‌డన్. మజా వచ్చింది.
మహ్మద్ కైఫ్
పాండ్యా నుంచి నమ్మశక్యం కాని సెంచరీ. అద్భుత కౌంటర్ ఎటాక్. తొలి 50 పరుగులు 61 బంతుల్లో మిగతావి 25 బంతుల్లోనే సాధించాడు.
హర్షా భోగ్లే
హార్దిక్ ఒక సెషన్‌లో వంద పరుగులు చేశాడు. అద్భుత సామర్థ్యంతో గేరు మార్చాడు. అతడి తొలి 50 పరుగులే నన్ను బాగా ఆకర్షించాయి.
మోహన్ దాస్ మేనన్
భారత్‌కు 483వ టెస్టు సెంచరీ అందించిన 81వ టెస్టు బ్యాట్స్‌మన్ హార్దిక్ పాండ్యా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications