Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరో ఘనత: కపిల్ రికార్డుని సమం చేసిన అశ్విన్

మొహాలి: ఇంగ్లాండ్‌తో మొహాలిలోని ఐఎస్ బింద్రా స్డేడియంలో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను సాధించాడు. టీమిండియా మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ కపిల్ దేవ్ రికార్డుని సమం చేశాడు.

ఇంగ్లాండుపై భారత్ మూడో టెస్టును కూడా గెలుచుకుంటుందా?

భారత జట్టులోకి ఆల్ రౌండర్‌గా అరంగేట్రం చేసిన అశ్విన్ అటు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లోయర్ ఆర్డర్‌లో భారత జట్టు ఇన్నింగ్స్‌ల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తమిళనాడుకు చెందిన ఈ ఆల్ రౌండర్ తాజాగా మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

టెస్టుల్లో ఒక కేలండర్ ఇయర్‌లో 50 వికెట్లు తీసుకోవడంతో పాటు 500కు పైగా పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా అశ్విన్ మరో ఘనతను అందుకున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ కపిల్ దేవ్ 1979 (619 పరుగులు, 74 వికెట్లు), 1983 (579 పరుగులు, 75 వికెట్లు) రెండు సార్లు ఈ ఫీట్‌ని సాధించాడు.

 అంతక ముందు ఏడుగురు

అంతక ముందు ఏడుగురు

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఈ ఘనతను కేవలం ఏడుగురు ఆటగాళ్లు సాధించారు. ఇంగ్లాండ్ ఇయాన్ బోథమ్ (రెండుసార్లు), దక్షిణాఫ్రికా షాన్ పొల్లాక్ (రెండుసార్లు), మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా), డానియేల్ వెటోరి (న్యూజిలాండ్), ఆండ్రూ ఫ్లింటాప్ (ఇంగ్లాండ్)లు మిగతా ఐదుగురిలో ఉన్నారు.

72 పరుగుల వద్ద అశ్విన్ ఔట్

72 పరుగుల వద్ద అశ్విన్ ఔట్

మొహాలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆదివారం ఆట ముగిసే సమయానికి రవిచంద్రన్ అశ్విన్ (57నాటౌట్‌)గా క్రీజులో ఉన్నాడు. దీంతో అశ్విన్ 56 వికెట్లు తీసుకుని 530 పరుగులను నమోదు చేశాడు. ఇక 271/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజైన సోమవారం ఆట ప్రారంభించిన టీమిండియా జట్టు స్కోరు 301 పరుగుల వద్ద అశ్విన్ 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. స్టోక్స్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అశ్విన్ పెవిలియన్‌కు చేరాడు.

 రాణించిన అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్‌లు

రాణించిన అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్‌లు

మొహాలి టెస్టులో అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్‌లు అర్ధ సెంచరీలతో రాణించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 417 పరుగులకు ఆలౌటైంది. దీంతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 134 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

50కి పైగా వికెట్లు, 500కు పైగా పరుగులు

50కి పైగా వికెట్లు, 500కు పైగా పరుగులు

అంతక ముందు ఒక కేలండర్ ఇయర్‌లో టెస్టు క్రికెట్లో 50కి పైగా వికెట్లు, 500కు పైగా పరుగులు సాధించిన భారత మూడో క్రికెటర్‌‌గా, ప్రపంచంలో ఓవరాల్‌ గా ఏడో ఆటగాడిగా అశ్విన్‌ రికార్డు నెలకొల్పాడు. గతంలో 1952లో వినూ మన్కడ్‌, 1979, 1983లలో కపిల్‌ దేవ్‌ ఈ ఘనత సాధించారు.

నెంబర్‌ వన్‌ బౌలర్‌‌గా, నెంబర్‌ వన్‌ ఆల్ రౌండర్

నెంబర్‌ వన్‌ బౌలర్‌‌గా, నెంబర్‌ వన్‌ ఆల్ రౌండర్

తాజాగా ఇంగ్లాండ్‌తో మొహాలీలో జరుగుతున్న మూడో టెస్టులో రాణించి అశ్విన్‌ ఈ రికార్డు నమోదు చేశాడు. తద్వారా వినూ మన్కడ్‌, కపిల్‌ దేవ్‌ సరసన నిలిచాడు. టెస్టు ర్యాంకింగ్స్‌ లో ప్రస్తుతం నెంబర్‌ వన్‌ బౌలర్‌‌గా, నెంబర్‌ వన్‌ ఆల్‌ రౌండర్‌‌గా కొనసాగుతున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌‌గా, ప్రపంచంలో రెండో క్రికెటర్‌‌గా అశ్విన్‌ ఇదివరకే రికార్డు నెలకొల్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+