Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పరుగుల విషయంలో ధోనీ కంటే ముందున్న విరాట్ కోహ్లీ

3rd Test: India captain Virat Kohli breaks MS Dhoni's record in Johannesburg

హైదరాబాద్: భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో కొత్త రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు ధోనీ చేయలేని పరుగులను సాధించి మహీని అధిగమించాడు. శుక్రవారం జోహన్నస్ బర్గ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 47 వ టెస్ట్‌ను పూర్తి చేశాడు.

బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించని పిచ్‌పై ఆడిన కోహ్లీ బహు కష్టంపై పరుగులను సాధించాడు. దీంతో ధోనీ 60 టెస్టుల్లో 3454 పరుగులను విరాట్ దాటేశాడు. 47 టెస్టులు ఆడిన కోహ్లీ 3456 పరుగులను చేసి ధోనీ కంటే ముందు నిలిచాడు. అదే 47 టెస్టులు ఆడిన భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరిట 2856 పరుగులను చేసిన రికార్డు ఉంది.

2014 డిసెంబరు నుంచి భారత టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 14 సెంచరీలు చేశాడు. కెప్టెన్‌గా తన మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియా జట్టుతో అడిలైడ్‌లో జరిగింది. ఈ ఢిల్లీ క్రికెటర్ ఐసీసీ ఈ ఏడాది ప్రకటించిన క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను గెలుచుకున్నాడు. ఐసీసీ ప్రకటించిన టెస్ట్ క్రికెట్ జాబితాలో రెండో స్థానంలో ఉండగా మొదటి స్థానంలో స్టీవ్ స్మిత్ ఉన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, January 26, 2018, 17:44 [IST]
Other articles published on Jan 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+