ఫోటోలు: షమీ బౌన్సర్లకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెంబేలు
మొహాలి: ఇంగ్లాండ్‌తో మొహాలిలో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 78/4 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటలో భాగంగా మంగళవారం ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.
రూట్ (36), బ్యాటీ (0) బ్యాటింగ్‌కు దిగారు. మ్యాచ్ ప్రారంభమైన రెండో ఓవర్ లోనే ఆల్ రౌండర్ జడేజా బ్యాటీని ఔట్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బట్లర్‌ను 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జయంత్ యాదవ్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 152 పరుగుల వద్ద జో రూట్‌ని జడేజా పెవిలియన్‌కు పంపాడు.

పుల్ లెంగ్త్ బంతులతో పాటు బౌన్సర్లు
దీంతో ఇంగ్లాండ్ ఏడో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు హమిద్(59 నాటౌట్), వోక్స్(30)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే ఈ సమయంలో బౌలింగ్‌కు వచ్చిన షమీ పదునైన పుల్ లెంగ్త్ బంతులతో పాటు బౌన్సర్లు వేసి ఇంగ్లాండ్ ఆటగాళ్లను భయపెట్టాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 2
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన షమీ, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసుకున్నాడు. ఈ రెండు వికెట్లు కూడా బౌన్సర్లు సంధించిన తీసుకోవడం విశేషం. ముఖ్యంగా 84వ ఓవర్‌ను వేసిన షమీ తొలి బంతినే క్రీజులో ఉన్న వోక్స్‌కు బౌన్సర్‌గా వేశాడు.

వోక్స్ హెల్మెట్‌ను తాకిన షమీ బౌన్సర్
ఈ బంతికి వోక్స్ తడబడటంతో పాటు వోక్స్ హెల్మెట్‌ను బలంగా తాకింది. అంతేకాదు వోక్స్ హెల్మెట్ కు ఉన్న నెక్‌గార్డ్ ఎగిరి కిందపడింది. అయితే ఈ బంతికి వోక్స్‌కు ఎటువంటి గాయం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక రెండో బంతిని కూడా షమీ బౌన్సర్ రూపంలోనే సంధించాడు.

తడబడిన వోక్స్ 30 పరుగుల వద్ద ఔట్
ఈ బంతిని ఆడటంతో తడబడిన వోక్స్ 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ కీపర్ పార్ధీవ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రషీద్‌ను అదే ఓవర్‌లో నాలుగో బంతిని ఆడబోయి ఉమేశ్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

238 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్
దాంతో ఇంగ్లాండ్ జట్టు 195 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జేమ్స్ అండర్సన్(5) రనౌట్ కావడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో రవి చంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీసుకోగా, షమీ, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్‌లకు తలా రెండు వికెట్లు తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications