మూడో టెస్టు: కోహ్లీసేన 'దూకుడు'పై కుంబ్లే ఇలా (ఫోటోలు)
హైదరాబాద్: మైదానంలో తన జట్టుకు దూకుడు తగ్గించుకోవాల్సిన అవసరం లేదని టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. మూడో టెస్టుని పురస్కరించుకుని కుంబ్లే మీడియాతో మాట్లాడాడు. మూడో టెస్టులో కోహ్లీసేన దూకుడు తగ్గించకూడదని, తమ ఆటగాళ్లు ఎందుకు వెనకడుగు వేయాలంటూ కుంబ్లే ప్రశ్నించాడు.
ఆటగాళ్లు హద్దుల్లో ఉన్నంత వరకు వారి విషయంలో తాను జోక్యం చేసుకోవాలనుకోవడం లేదన్నాడు. 'ఆటగాళ్ల నుంచి ఏది ఆశిస్తున్నామో.. అది నెరవేరుస్తున్నంత వరకు వారి సహజ స్వభావాన్ని నియంత్రించాలని నేను అనుకోవడం లేదు. దీనిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు. ఆడేటప్పుడు ప్రతి క్రికెటర్ ఒక్కో రకమైన విధానాన్ని అనుసరిస్తాడు' అని చెప్పాడు.

పోటాపోటీగా మూడో టెస్టు
రాంచీలో జరగనున్న మూడో టెస్టు మరింత పోటాపోటీగా జరిగే అవకాశం ఉందన్నాడు. ‘ఇది ఎంతో కీలకమైన మ్యాచ్. సిరీస్ 1-1తో సమమైన నేపథ్యంలో మూడో టెస్ట్‌లో ఇరు జట్లూ తీవ్రంగా పోరాడవచ్చు. అయితే అంతిమంగా క్రికెట్టే గెలుస్తుంది' అని చెప్పుకొచ్చాడు. రెండో టెస్టులో కోహ్లీ, స్మిత్ మధ్య తలెత్తిన వివాదంపై బీసీసీఐ, సీఏ బోర్డులు రాజీకి రావడం శుభపరిణామమని చెప్పాడు.

ఎంతో పరిణతితో వ్యవహారించారు
టీమిండియా సాధించిన అద్భుత విజయం మరుగున పడిపోకుండా ఎంతో పరిణతితో వివాదం సమసేలా చర్యలు తీసుకుందని ప్రశంసించాడు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో చర్చించి డీఆర్‌ఎస్ వివాదంపై బీసీసీఐ రాజీకి రావడం సముచిత చర్య అని కొనియాడాడు. అంతేకాదు, బెంగుళూరులో జరిగిన దాన్ని మరచి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నాడు.

కుంబ్లే, స్మితలు మాట్లాడుకున్నారు
ఇక రెండో టెస్టు తర్వాత కుంబ్లే, స్మితలు మాట్లాడుకున్నారా? అంటే.. అవును అని కుంబ్లే సమాధానమిచ్చాడు. తొలి టెస్టు కోల్పోయిన తర్వాత కోహ్లీసేన పుంజుకున్న తీరు అద్భుతమని కుంబ్లే కొనియాడాడు. ముఖ్యంగా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బౌలింగ్‌ను కొనియాడారు.

దానివల్లే విజయం సాధ్యమైంది
రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఓపెనర్ కెఎల్ రాహుల్ సరైన సమమాల్లో రాణించి మంచి భాగస్వామ్యాలు అందించడంతో విజయం సాధ్యమైందని కుంబ్లే చెప్పాడు. పేసర్ ఉమేశ్ యాదవ్ ఐదు వికెట్లు తీయాలని ప్రయత్నించడం శుభసూచకమని అన్నాడు. కోహ్లీ నాలుగు వరస సిరీస్‌లలో డబుల్ సెంచరీలతో చెలరేగడం, అశ్విన్ ఫాస్టెస్ట్ 250 వికెట్ల వీరుడిగా నిలవడం ఎంతో తృప్తినిచ్చిందన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications