హరారే: మూడో ట్వంటీ 20లో భారత్.. జింబాబ్వే పైన కష్టపడి గెలిచింది. తొలుత జింబాబ్వే స్కోరు చూస్తే సులభంగా గెలుస్తుందని భావించారు. కానీ ఆ తర్వాత మన బౌలర్లు కట్టడి చేశారు. దీంతో భారత్ మూడు పరుగుల తేడాతో గెలిచి 2-1తో సిరీస్ గెలుచుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది.
చివరి ఓవర్ తీవ్ర ఉత్కంఠ...
చివరి ఓవర్ తీవ్ర ఉత్కంఠను రేపింది. చివరి ఓవర్‌ను స్రాన్ వేశాడు. తొలి బంతికి మారుమా సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత బంతి వైడ్ వెళ్లింది. మరో బంతి నోబాల్, ఫోర్‌గా వెళ్లింది. అప్పటికే 2 బంతుల్లో 12 పరుగులు వచ్చాయి. చివరి నాలుగు బంతుల్లో కేవలం ఎనిమిది పరుగులే కావాలి.

ఈ సమయంలో స్రాన్ ఒత్తిడిలో బౌలింగ్ చేశాడు. రెండో బంతికి, మూడో బంతికి పరుగులు రాలేదు. నాలుగో బంతికి మరుమా ఒక పరుగు తీశాడు. ఐదో బంతికి చిగుంబర ఫోర్ కొట్టాడు. ఇక, చివరి బంతికి ఫోర్ చేయాల్సిన పరిస్థితి. అలాంటి స్థితిలో స్రాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి.. చిగుంబురను ఔట్ చేశాడు. దీంతో, చివరి బంతి వరకు మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా కనిపించింది.
జింబాబ్వే ఇన్నింగ్స్
- చివరి ఓవర్ ఉత్కంఠగా నడిచింది. చివరి ఓవర్ స్రాన్ వేశాడు. ఆ ఓవర్లో ఏకంగా 17 పరుగులు వచ్చాయి. అయితే, చివరి బంతికి చిగుంబురను అవుట్ చేయడంతో మ్యాచ్ భారత్ వశమైంది.
- ఐదో వికెట్‌గా వాలర్ వెనుదిరిగాడు. 17 బంతుల్లో 10 పరుగులు చేసి బూమ్రా బౌలింగులో అవుటయ్యాడు.
- జింబాబ్వే 13.5 ఓవర్ వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. చాహల్ బౌలింగులో మూర్ అవుటయ్యాడు. అప్పటికి జింబాబ్వే స్కోర్ 86.

- జింబాబ్వే 57 పరుగుల వద్ద మసకద్జ రూపంలో రెండో వికెట్, 60 పరుగుల వద్ద సిబండ రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. స్రాన్, అక్షర్ పటేల్, కులకర్ణిలు ఒక్కో వికెట్ తీసుకున్నారు.
- మకసద్జ ఆచితూచి ఆడుతున్నా, సిబండ దూకుడుగా ఆడుతున్నాడు.
- 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే దూకుడుగా ఆడుతోంది. 5 ఓవర్లలోనే 38 పరుగులు చేసింది. కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. అంతకుముందు శ్రాన్ బౌలింగులో చిబాబా 10 బంతుల్లో 5 పరుగులు చేసి అవుటయ్యాడు.
భారత్ ఇన్నింగ్స్
- నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. రాహుల్ (22), రాయుడు (20), జాదవ్ (58) చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. తిరిపానో మూడు వికెట్లు, మద్జీవా ఒక వికెట్, క్రీమర్ ఒక వికెట్ తీసుకున్నాడు.
- 18.6 వ ఓవర్లో జాదవ్ అవుటయ్యాడు. జదవ్ ఒక్కడే నిలకడగా ఆడాడు. అతను 42 బంతుల్లో 58 పరుగులు చేశాడు. తిరిపానో బౌలింగులో అవుటయ్యాడు. 19 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 122. ఆరు వికెట్లు కోల్పోయింది.
- భారత్ 16.2 ఓవర్ వద్ద అయిదో వికెట్ కోల్పోయింది. ధోనీ 13 బంతుల్లో 9 పరుగులు చేసి అవుటయ్యాడు. ధోనీ నిరాశపరిచాడు. 102 పరుగులకు అయిదు వికెట్లు పోయాయి.
- 12.5 ఓవర్లు ముగిసేసరికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది.

- భారత్ నిలకడగా ఆడుతుందనుకున్న సమయంలో అంబటి రాయుడు అవుటయ్యాడు. క్రీమర్ బౌలింగులో చిగుంబరకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 26 బంతుల్లో 20 పరుగులు చేశాడు.
- ఐదు ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది. అంబటి రాయుడు, కేదార్ జాదవ్‌లు క్రీజులో ఉన్నారు.
- వికెట్లు టపటపా రాలుతున్నాయి. 27 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. కెఎల్ రాహుల్ 20 బంతుల్లో 20 పరుగులు చేసి మద్జీవా బౌలింగులో అవుటయ్యాడు. 27 పరుగుల వద్దనే పాండే కూడా రనౌట్ అవుటయ్యాడు.
- భారత్ ఆదిలోనే ఓ వికెట్ కోల్పోయింది. 23 పరుగుల వద్ద తిరిపానో బౌలింగులో మన్‌దీప్ సింగ్ అవుటయ్యాడు. ఇతను ఆరు బంతులు ఆడి 4 పరుగులు చేశాడు.
భారత జట్టు: ధోనీ (కెప్టెన్), కెఎల్ రాహుల్, మన్‌దీప్ సింగ్, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేదార్ జాదవ్, అక్షర్ పటేల్, ధవల్ కులకర్ణి, జస్ప్రీత్ బూమ్రా, బరిందర్ శ్రాన్, యజ్వేంద్ర చాహల్.
జింబాబ్వే జట్టు: గ్రీమ్ క్రీమర్ (కెప్టెన్), చిబాబా, మసకద్జ, సికందర్ రాజా, మాల్కోమ్ వాలర్, చిగుంబర, పీ మూర్, ముటోంబోడ్జి, మద్జీవా, ముజరబని, దొనాల్డ్ తిరిపానో