Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

3rd T20I: ఫించ్ అవుట్, కెప్టెన్‌గా షేన్ వాట్సన్

సిడ్నీ: భారత్‌తో ఆదివారం (జనవరి 31)న జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌కి ఆస్ట్రేలియా జట్టుకు ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ కెప్టెన్‌గా బాధ్యతలను స్వీకరించనున్నాడు. ఆస్టేలియా రెగ్యులర్ కెప్టన్ ఆరోన్ ఫించ్ శుక్రవారం మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో గాయపడ్డాడు.

రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే సమయంలో ఫించ్ ఎడమ కాలి తోడ కండరాలు పట్టేశాయి. దీంతో మూడో టీ-20 మ్యాచ్‌కి దూరమయ్యాడు. ఆరోన్ ఫించ్‌ స్థానంలో లెప్ట్‌ హ్యాండ్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖవాజా తుది జట్టులో స్ధానం లభించింది.

న్యూజిల్యాండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌లోనూ ప్రకటించిన జట్టులో ఖవాజా చోటు సంపాదించిన సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 సిరీస్‌లో భారత్‌ ఇప్పటికే రెండు మ్యాచుల్లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆసీస్ జట్టుపై టీమిండియా 27 పరుగుల తేడాతో విజయం సాధించింది.

3rd T20I: Shane Watson to lead Australia against India, Aaron Finch injured

కెప్టెన్‌గా ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహించడం గర్వకారణమని, ఇప్పటికే సిరీస్‌ భారత్‌కు కోల్పోయినా మూడో టీ20ని వరల్డ్‌ కప్‌ను దృష్టిలో పెట్టుకొని ఆడతామని షేన్ వాట్సన్ తెలిపాడు. మూడో మ్యాచ్‌లో గెలిచేందుకు తీవ్రంగా కృషిచేస్తామన్నాడు.

ఆస్ట్రేలియా జట్టు:

షేన్ వాట్సన్ (కెప్టెన్), కామెరాన్ బాన్‌క్రాప్ట్, స్కాట్ బోలాండ్, కామెరాన్ బోయ్స్, జేమ్స్ ఫాల్క్నర్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లియాన్, క్రిస్ లిన్, షాన్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, షాన్ టైట్, ఆండ్రూ టై.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+