For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్: మెరిసిన రోహిత్, కోహ్లీ, చివరలో రైనా, యూవీ

సిడ్నీ: మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో గెలుపొందిన భారత్.. ఆదివారం జరిగిన మూడో మ్యాచులోనూ ఆసీస్‌ను ఓడించి సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. వన్డే సిరీస్ కోల్పోయినప్పటికీ టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి భారత్ ప్రతీకారంతీర్చుకుంది. రోహిత్, కోహ్లీ, రైనా, యూవీలు రాణించడంతో చివరి టీ20 మ్యాచులోనూ భారత్ విజయం సాధించింది.

సిడ్నీ మైదానంలో ఆదివారం జరిగిన మూడో టీ20 మ్యాచులో ఆసీస్ విధించిన 198 పరుగల లక్ష్యఛేదనలో భారత్ కూడా ధాటిగానే ఆరంభించింది. అయితే 9బంతుల్లో 26 పరుగులు చేసిన ధావన్.. వాట్సన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అనంతరం బైసీ బైలింగ్ లో రోహిత్ 52(5 ఫోర్లు, ఒక సిక్స్) పరుగుల వద్ద ఔటయ్యాడు.

3rd T20I: Australia win toss, opt to bat first against India at SCG

50 పరుగులు చేసిన తర్వాత కోహ్లీ కూడా బైసీ బౌలింగ్ లోనే ఔటయ్యాడు. కాగా, రైనా 39 బంతుల్లో 49(6ఫోర్లు, ఒక సిక్స్), యువరాజ్ సింగ్ 12 బంతుల్లో 15(ఒక ఫోర్, ఒక సిక్స్)పరుగులతో అజేయంగా నిలిచి భారత్ కు విజయాన్నందించారు.

3rd T20I: Australia win toss, opt to bat first against India at SCG

అంతకుముందు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ధాటిగా ఆడింది. తొలుత వికెట్లు కోల్పోయినప్పటికీ పరుగుల రాబట్టడంలో ఏమాత్రం తగ్గలేదు. 14 పరుగులు చేసిన ఓపెనర్ ఖవాజా... నెహ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత 9 పరుగులు చేసిన మార్ష్.. అశ్విన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

మాక్స్‌వెల్ కూడా 3 పరుగులకే యువరాజ్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 26 పరుగులు చేసి టిఎం హెడ్ వెనుదిరిగాడు. ఆ తర్వాత లిన్ 13పరుగులు చేసి ఔటయ్యాడు. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. వాట్సన్ 86 బంతుల్లో 124(10ఫోర్లు, 6సిక్స్ లు) పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

3rd T20I: Australia win toss, opt to bat first against India at SCG

కాగా, భారత బౌలర్లలో నెహ్రా, బుమ్రా, అశ్విన్, జడేజా, యువరాజ్ తలో వికెట్ తీశారు.

3rd T20I: Australia win toss, opt to bat first against India at SCG
Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+