Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ రికార్డు సమం: కోహ్లీ ఖాతాలో మరో మైలురాయి

మొహాలి: మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని చేరుకున్నాడు. ఆదివారం భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో కోహ్లీ సెంచరీ సాధించి (154 నాటౌట్) కివీస్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ క్రమంలో క్రికెజ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని విరాట్ కోహ్లీ సమం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో రాస్ టేలర్ ఇచ్చిన లైఫ్‌తో చెలరేగి పోయిన కోహ్లీ తన కెరీర్‌లో 26 సెంచరీని నమోదు చేశాడు. కోహ్లీ సెంచరీతో ఐదు వన్డేల సిరిస్‌లో భారత్ 2-1తేడాతో ముందంజలో ఉంది.

మూడో వన్డేలో కోహ్లీ సెంచరీ సాధించడంతో సచిన్ రికార్డుని సమం చేశాడు. లక్ష్య ఛేదనలో భాగంగా కోహ్లీకి ఇది 14వ సెంచరీ. సచిన్ కూడా పరుగుల ఛేదనలో 14 సెంచరీలు చేయడం విశేషం. అయితే కోహ్లీ ఈ 14 సెంచరీలను 59 ఇన్నింగ్స్‌లో చేస్తే, సచిన్ మాత్రం 124 ఇన్నింగ్స్‌లో నమోదు చేశాడు.

3rd ODI: Virat Kohli equals Sachin Tendulkar's record

మొత్తంగా చూస్తే రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 16 సెంచరీలు సాధించాడు. ఇక వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన నాలుగు ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 49 సెంచరీలతో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మొదటి స్ధానంలో ఉండగా, ఆ తర్వాతి స్ధానాల్లో రికీ పాంటింగ్ (30), సనత్ జయసూర్య (28), విరాట్ కోహ్లీ (26), కుమార సంగక్కర (25)లతో ఉన్నారు.

పరుగుల ఛేదనలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లు:

14 - విరాట్ కోహ్లీ (59 ఇన్నింగ్స్), సచిన్ టెండూల్కర్ (124)
9 - సయీద్ అన్వర్ (59 ఇన్నింగ్స్), తిలకరత్నే దిల్షాన్ (60), సనత్ జయసూర్య (103)

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+