ఈడెన్‌లో ధోనికి సన్మానం: హాజరుకానున్న కుటుంబ సభ్యులు
హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా చివరిదైన మూడో వన్డేకి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. ఇంగ్లాండ్‌తో మూడో వన్డే (జనవరి 22) ఆదివారం నాడు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.
ఇటీవలే టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ భాద్యతల నుంచి ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో మూడు ఫార్మెట్లకు కోహ్లీని కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. ధోని నుంచి కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న కోహ్లీ ఇంగ్లాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరిస్‌ను గెలుచుకున్నాడు.

0-2తో సిరిస్ కైవసం
మూడు వన్డేల సిరిస్‌లో ఇంకో వన్డే మిగిలుండగానే 0-2తో సిరిస్‌ను కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా గెలుచుకుంది. కోల్‌కతాలో జరగనున్న మూడో వన్డేలో పాల్గొనే మహేంద్ర సింగ్ ధోనిని ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ సన్మానించనున్నాడు.

ధోనిని సత్కరించనున్న క్యాబ్
ఈ సన్మాన కార్యక్రమంలో భాగంగా ధోనిని క్రిస్టల్ మెమెంటోతో పాటు షాలువా, పలు బహుమతులతో సత్కరించనున్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు ధోని కుటుంబ సభ్యులు సైతం మూడో వన్డేకు హాజరకానున్నారని తెలుస్తోంది. ఇక మూడో వన్డే నేపథ్యంలో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు శుక్రవారం కోల్‌కతాకు చేరుకున్న సంగతి తెలిసిందే.

రెండో వన్డేలో చెలరేగిన ధోని-యువరాజ్
మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా కటక్‌లో జరిగిన రెండో వన్డేలో యువరాజ్, మహేంద్ర సింగ్ ధోనిలు చెలరేగి ఆడారు. 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనిల జోడీ ఆదుకుంది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 256 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఆరేళ్ల తర్వాత సెంచరీ చేసిన యువీ
150 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యువీ వోక్స్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ధోని సైతం 106 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. 2011లో చివరిసారిగా వరల్డ్ కప్‌లో సెంచరీ సాధించిన యువరాజ్ మళ్లీ ఆరేళ్ల తర్వాత సెంచరీని సాధించాడు. ధోనీ కూడా 2013లో ఆస్ట్రేలియాపై చివరిసారిగా సెంచరీ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications