For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్: అరంగేట్రంలో అరుదైన రికార్డు

బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను దక్షిణాఫ్రికా 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా 200 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను దక్షిణాఫ్రికా 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా 200 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. డుప్లెసిస్‌ (91), డికాక్‌ (73), మార్‌క్రమ్‌ (66), బవుమా (48) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 6 వికెట్లకు 369 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 40.4 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌటైంది. షకీబ్ ఉల్ హసన్‌ (63) టాప్‌ స్కోరర్‌‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే ఈ మూడు వన్డేల సిరిస్‌తో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎయిడెన్ మార్‌క్రమ్‌ రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

3rd ODI: Markram shines on debut as South Africa complete series sweep

మూడో వన్డేలో మార్‌క్రమ్ 60 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేశాడు. తద్వారా టెస్ట్‌, వన్డే అరంగేట్ర మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలు నమోదు చేసిన దక్షిణాఫ్రికా రెండో క్రికెటర్‌గా నిలిచాడు. బంగ్లాతో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో మార్‌క్రమ్‌ హాఫ్‌ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

అంతకముందు టెస్టు, వన్డే ఫార్మాట్లలో అరంగేట్ర మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలు చేసిన దక్షిణాఫ్రికా తొలి ఆటగాడిగా డుప్లెసిస్ ఉన్నాడు. మరోవైపు టెస్టు, వన్డే ఫార్మాట్లలో అరంగేట్ర మ్యాచ్‌లలో రనౌట్ అయిన దక్షిణాఫ్రికా తొలి క్రికెటర్‌గానూ ఎయిడెన్ మార్‌క్రమ్ నిలిచాడు.

బంగ్లాతో జరిగిన టెస్టు సిరిస్‌ అరంగేట్రంలో హాఫ్ సెంచరీ అనంతరం రనౌట్ అయిన మార్‌క్రమ్, ఆదివారం బంగ్లాతో జరిగిన మూడో వన్డేలో హాఫ్‌ సెంచరీ చేసి రనౌట్ అయ్యాడు. మొత్తంగా టెస్టు, వన్డే ఫార్మాట్లలో అరంగేట్ర మ్యాచ్‌లలో రనౌట్ అయిన నాలుగో క్రికెటర్‌గా మార్‌క్రమ్ నిలిచాడు. గతంలో బాసిల్ డి ఓలివేరా, బ్రియాన్‌ ల్యూక్‌హర్స్ట్‌, సులేమాన్‌ బెన్ రెండు ఫార్మట్లలో తొలి మ్యాచ్‌లలో రనౌట్ అయ్యారు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+