3వ వన్డేకు రంగం సిద్ధం: ఫేవరేట్‌గా బరిలోకి కోహ్లీసేన
హైదరాబాద్: టీమిండియా, వెస్టిండిస్ జట్ల మధ్య కీలకమైన మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. అంటిగ్వాలోని వివ్ రిచర్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా రెండో వన్డేలో కోహ్లీ సేన భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే సిరీస్‌లో 1-0తో ఉన్న కోహ్లీసేన ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది.
సొంతగడ్డపై పరువు కాపాడుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని వెస్టిండిస్ ఉంది. టాపార్డర్ అద్భుత బ్యాటింగ్‌కు తోడు బౌలర్లు పిచ్‌ను సద్వినియోగం చేసుకుని చెలరేగడంతో విండీస్ గడ్డపై రెండో వన్డేలో తొలిసారి భారీ తేడాతో టీమిండియా విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఇక మూడో వన్డేలో కోహ్లీ సేన ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.

రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించుకునే అవకాశం
మరోవైపు సొంతగడ్డపై వెస్టిండిస్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే, ఆ తర్వాతి రెండింటిలో రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించుకునే అవకాశం వస్తుందని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇక మూడో వన్డేలో జట్టు ఆటగాళ్లు ఎలాంటి నిర్లక్ష్యానికి తావీయకుండా బుధవారం నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చారు.

విండీస్ బౌలర్లు విఫలం
రెండో వన్డేలో విండీస్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో రహానే సెంచరీతో చెలరేగితే, ధవన్, కోహ్లీ అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. దీంతో శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ ఇదే ఫామ్‌ను పునరావృతం చేయాలని ఈ త్రయం భావిస్తున్నది. మిడిలార్డర్‌లో యువరాజ్ విఫలమవడం ఆందోళన కలిగించే అంశం.

పటిష్టంగా భారత్ బ్యాటింగ్ లైనప్
ధోని కూడా తన బ్యాట్‌తో ఝుళిపించాల్సిన సమయం ఆసన్నమైంది. యువ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కేదార్ జాదవ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. ఈ సిరిస్‌లో చోటు దక్కించుకున్న యువ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు చోటు కల్పిస్తారా అనేది వేచిచూడాల్సిందే.

అద్భుతమైన ఫామ్‌లో భువనేశ్వర్
ఇక బౌలింగ్ విషయానికి వస్తే పేసర్ భువనేశ్వర్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, ఉమేశ్ యాదవ్ అతడికి తోడుగా మెరవాల్సి ఉంది. ఇక వెస్టిండిస్ జట్టు కూడా మిగిలిన మూడు వన్డేల కోసం జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. కార్టర్, విలియమ్స్‌లను తప్పించి బ్యాట్స్‌మెన్ కైల్ హోప్, సునీల్ అంబ్రిస్‌లను జట్టులోకి తీసుకుంది.

వెస్టిండిస్ జట్టుతో స్వప్ల మార్పాలు
వీరిద్దరూ తొలిసారిగా వెస్టిండిస్ జట్టు తరఫున ఆడనున్నారు. ఈ మార్పులతోనైనా విజయం దక్కించుకోవాలని జట్టు ఆశిస్తోంది. తద్వారా వరల్డ్ కప్‌లో అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. బ్యాటింగ్‌లో షాయ్ హోప్, చేజ్, పావెల్‌లపై ఆధారపడుతున్న ఈ జట్టు బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా చేతులెత్తేస్తోంది.

జట్లు (అంచనా)
టీమిండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రహానే, ధావన్, యువరాజ్, ధోని, పాండ్యా, జాదవ్, కుల్దీప్, అశ్విన్, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్.
వెస్టిండిస్: జాసన్ హోల్డర్ (కెప్టెన్), లూయిస్, హోప్, షాయ్ హోప్, మొహమ్మద్, చేజ్, పావెల్ / అంబ్రిస్, నర్స్, జోసెఫ్, బిషూ, కమిన్స్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications