ఉతికి ఆరేసిన యూసుఫ్ పఠాన్, మూడో వన్డేలో భారత్ విజయం

అంతకుముందు జహీర్ (3/43), మునాఫ్ (2/42), హర్భజన్ (2/23) విజృంభించడంతో భారత్ దక్షిణాఫ్రికాను 220 పరుగులకు ఆలౌట్ (49.2 ఓవర్లలో) చేసింది. డుమిని (52; 59 బంతుల్లో 2X4), ప్లెసిస్ (60; 78 బంతుల్లో 2X4) దక్షిణాఫ్రికాను ఆదుకున్నారు. కష్టాల్లో ఉన్న దక్షిణాఫ్రికాను డుమిని, ప్లెసిస్ ఆదుకున్నారు. 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌటయ్యే ప్రమాదం నుంచి సంశయలబ్ధితో బయటపడ్డ డుమిని..అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అరంగేట్ర ఆటగాడు ప్లెసిస్ తో కలిసి పరిస్థితిని చక్కదిద్దాడు. ఇద్దరూ క్రమం తప్పకుండా సింగిల్స్ తీస్తూ స్కోరు బోర్డును నడిపించారు. ఎంతో సహనంతో ఆడారు. అస్సలు భారీ షాట్లకు ప్రయత్నించలేదు. 110 పరుగుల వీరి భాగస్వామ్యంలో బౌండరీలు నాలుగే.
జహీర్, మునాఫ్ మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేశారు. 220 పరుగులకే దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు. భారీషాట్లకు సిద్ధమైన ప్లెసిస్, డుమినిలు నాలుగు బంతుల వ్యవధిలోనే వెనక్కి పంపి ఆతిథ్య జట్టును దెబ్బతీశారు. 45వ ఓవర్లో మునాఫ్..ప్లెసిస్ ను ఔట్ చేస్తే, ఆ తర్వాతి ఓవర్లో జహీర్...డుమినిని బౌల్డ్ చేశాడు. పార్నెల్, స్టెయిన్, బోథా, సొత్సొబె పెవిలియన్ కు క్యూ కట్టారు. దక్షిణాఫ్రికా చివరి ఆరు వికెట్లను కేవలం 20 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. మునాఫ్, జహీర్ ధాటికి పవర్ ప్లేల్లో ఆ జట్టు ఘోరంగా దెబ్బతింది. 20 ఓవర్లలో 82 పరుగులు మాత్రమే చేసింది.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: స్మిత్ (సి) కోహ్లి (బి) హర్భజన్ 43; ఆమ్లా (బి) జహీర్ 16; ఇంగ్రామ్ (సి) కోహ్లి (బి) హర్భజన్ 10; డివిలియర్స్ (సి) జహీర్ (బి) యూసుఫ్ 16; డుమిని (బి) జహీర్ 52; ప్లెసిస్ (సి) కోహ్లి (బి) మునాఫ్ 60; బోథా (బి) జహీర్ 9; పార్నెల్ రనౌట్ 5; స్టెయిన్ (సి) రైనా (బి) మునాఫ్ 5; మోర్నీ మోర్కెల్ నాటౌట్ 0; సొత్సొబె రనౌట్ 0; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (49.2 ఓవర్లలో ఆలౌట్) 220
వికెట్ల పతనం: 1-31, 2-49, 3-83, 4-90, 5-200, 6-202, 7-207, 8-216, 9-219
బౌలింగ్: జహీర్ 9.2-0-43-3; మునాఫ్ పటేల్ 10-1-42-2; నెహ్రా 7-0-42-0; హర్భజన్ 9-1-23-2; యూసుఫ్ పఠాన్ 6-0-27-1; యువరాజ్ 6-0-30-0; రోహిత్ 1-0-5-0; రైనా 1-0-8-0
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications