Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

3వ వన్డే హైలెట్స్: జస్ట్ మిస్, 5 పరుగులతో ఇంగ్లాండ్ విజయం

హైదరాబాద్: వన్డే సిరిస్‌లో ఇంగ్లాండ్ జట్టుకు కాస్త ఊరట లభించింది. తొలి రెండు వన్డేల్లో భారీ స్కోర్లు చేసినా ఓటమిపాలైన ఇయాన్ మోర్గాన్ సేనకు ఎట్టకేలకు చివరి విజయం ఓదార్పునిచ్చింది. 322 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఛేదనలో తడబడింది. దీంతో ఇంగ్లాండ్‌పై వైట్ వాష్ లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ సిరిస్‌ను 2-1తో సొంతం చేసుకుంది.

కేదార్ జాదవ్ చివరి వరకూ కొనసాగించిన పోరాటం ఈడెన్ గార్డెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉండడంతో, ఎంతటి లక్ష్యాన్నయినా ఛేదించే సత్తా ఉందన్న నమ్మకంతో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకుని ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఇంగ్లాండ్‌ ఓపెనర్ జాసన్ రాయ్ కీలక ఇన్నింగ్స్

ఇంగ్లాండ్‌ ఓపెనర్ జాసన్ రాయ్ కీలక ఇన్నింగ్స్

ఇంగ్లాండ్‌కు ఓపెనర్ జాసన్ రాయ్ 65 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి వికెట్‌కు 98 పరుగులు జత కలిసిన తర్వాత సాబ్ బిల్లింగ్స్‌ను రవీంద్ర జడేజా పెవిలియన్‌కు పంపాడు. 58 బంతులు ఎదుర్కొన్న బిల్లింగ్స్ 35 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన జానీ బెయిర్‌స్టో (56)ని జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు.

బెన్ స్టోక్స్ విజృంభణ

బెన్ స్టోక్స్ విజృంభణ

దీనితో, రెండో డౌన్‌లో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ క్రీజ్‌లోకి వచ్చాడు. అతను 44 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. ఇక జొస్ బట్లర్ 11 పరుగులు చేసి హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో లోకేష్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చిన అవటయ్యాడు. లోయల్ మిడిల్ ఆర్డర్‌లో బెన్ స్టోక్స్ విజృంభణతో ఇంగ్లాండ్ స్కోరు బోర్డు పరుగులు తీసింది.

చెలరేగిన క్రిస్ వోక్స్

చెలరేగిన క్రిస్ వోక్స్

మోయిన్ అలీ రెండు పరుగులకే అవుట్‌కాగా, క్రిస్ వోక్స్ 19 బంతుల్లోనే 34 పరుగులు సాధించాడు. చివర్లో స్టోక్స్, వోక్స్ ఏడో వికెట్‌కు 73 పరుగులు సమకూర్చడంతో భారీ స్కోరు సాధ్యమైంది. భారత బౌలర్ హార్దిక్ పాండ్యకు మూడు వికెట్లు లభించాయి. రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీసుకున్నారు.

భారత లక్ష్యం 322 పరుగులు

భారత లక్ష్యం 322 పరుగులు

అనంతరం 322 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ బౌలర్ డేవిడ్ విల్లే వేసిన బంతిని అర్థం చేసుకోలేక రహానే (1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ 11 బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేసి, జాక్ బాల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జొస్ బట్లర్ క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరాడు.

కోహ్లీ, యువరాజ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం

కోహ్లీ, యువరాజ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం

అనంతరం విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 63 బంతులు ఎదుర్కొని, ఎనిమిది ఫోర్లతో 55 పరుగులు చేసిన కోహ్లీని జొస్ బట్లర్ చక్కటి క్యాచ్ అందుకోగా బెన్ స్టోక్స్ అవుట్ చేయడంతో రన్‌రేట్ కొద్దిగా మందగించింది. యువరాజ్ సింగ్ 57 బంతులు ఎదుర్కొని, 45 పరుగులు చేశాడు.

యువరాజ్ 45 అవుట్

యువరాజ్ 45 అవుట్

జట్టు స్కోరు 133 పరుగుల వద్ద అతను లియామ్ ప్లంకెట్ బౌలింగ్‌లో శామ్ బిల్లింగ్స్‌కు దొరికాడు. రెండో టెస్టులో యువీతో పాటు సెంచరీ చేసిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 25 పరగులకే వెనుదిరిగాడు. జాక్ బాల్ బౌలింగ్‌లో అతను జొస్ బట్లర్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు.

గెలుపు కోసం 18 ఓవర్లలో 149 పరుగులు

గెలుపు కోసం 18 ఓవర్లలో 149 పరుగులు

టీమిండియా గెలువాలంటే 18 ఓవర్లలో 149 పరుగులు చేయాలి. ఈ దశలో కేదార్ జాదవ్ (75 బంతుల్లో 90, 12 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (43 బంతుల్లో 56, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఆరో వికెట్‌కు 104 పరుగులు జోడించి జట్టును గెలుపు అంచుల్లో తీసుకొచ్చారు.

అనూహ్యంగా చివర్లో ఔటైన హార్ధిక్ పాండ్యా

అనూహ్యంగా చివర్లో ఔటైన హార్ధిక్ పాండ్యా

ఈ దశలో హార్దిక్ అనూహ్యంగా ఔటయ్యాడు. దీంతో 24 బంతుల్లో 43గా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో కేదార్ జాదవ్ ఒంటరిపోరాటం చేశాడు. మరో ఎండ్‌లో తన సహచర క్రికెటర్లు వెనుదిరిగినా తాను మాత్రం అద్భుతమైన బ్యాటింగ్‌తో

అభిమానులను అలరించాడు. ఆరు బంతుల్లో 16 పరుగులు చేయాల్సిన దశలో తొలి రెండు బంతులకు ఓ ఫోర్, సిక్సర్ కొట్టి ఆశలు రేకెత్తించాడు.

స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, కేదార్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్

స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, కేదార్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్

కానీ రెండు డాట్ బాల్స్ తర్వాత ఐదో బంతిని జాదవ్ గాల్లోకి లేపగా.. బౌండరీ వద్ద నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లడంతో భారత్ విజయం ముగింట బోల్తా పడింది. దీంతో మూడో వన్డేలో ఇంగ్లాండ్ 5 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో భారక్ కైవసం చేసుకుంది. స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, కేదార్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+