For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్‌ బెంబేలు: 444తో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు

నాటింగ్‌హామ్‌: వన్డే క్రికెట్‌ చరిత్రలో మరో అద్భుతం చోటుచేసుకుంది. వన్డేల్లో పదేళ్ల రికార్డు బద్దలైంది. పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ బీభత్సమే సృష్టించారు. సూపర్ సెంచరీతో హేల్స్.. భారీ షాట్లతో విరుచుకుపడిన బట్లర్, మోర్గాన్ పాక్ బౌలర్లను బెంబేలెత్తించారు.

మంగళవారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 444 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు. గతంలో ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉంది. 2006లో నెదర్లాండ్స్‌పై లంక 443 పరుగులు చేసింది. కాగా, పాకిస్థాన్ 42.4ఓవర్లకే 275 పరుగులు చేసి అలౌటైంది.

3rd ODI: England post world record 444/3 against Pakistan, Alex Hales hits 171

ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ ఆకాశమే హద్దుగా పరుగుల ప్రళయంతో ముంచెత్తారు. అత్యుత్తమ పేస్ బౌలర్లతో వర్ధిల్లుతున్న పాక్ బౌలర్లను ఏ మాత్రం కనికరం లేకుండా ఓపెనర్ అలెక్స్ హేల్స్(122 బంతుల్లో 171, 22 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత సెంచరీతో విజృంభించాడు. తనకెంతో అచ్చొచ్చిన స్టేడియంలో హేల్స్..పాక్ బౌలర్ల పాలిట సింహస్వప్నంలా మారాడు.

హేల్స్‌కు జతగా మిడిలార్డర్‌లో రూట్(86 బంతుల్లో 85), బట్లర్(51 బంతుల్లో 90 నాటౌట్, 7ఫోర్లు, 7సిక్స్‌లు), మోర్గాన్(27 బంతుల్లో 57 నాటౌట్, 3ఫోర్లు, 5 సిక్స్‌లు) పరుగుల ప్రవాహంతో నాలుగు వందలకుపైగా స్కోరు నమోదైంది. దీంతో 2006లో నెదర్లాండ్స్‌పై శ్రీలంక నమోదు చేసిన 443/9 అత్యధిక పరుగుల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+