1991 తర్వాత మళ్లీ: అతి పెద్ద విజయాన్ని నమోదు చేసిన ఇంగ్లాండ్
హైదరాబాద్: ఇంగ్లాండ్ చేతిలో వెస్టిండిస్ వైట్ వాష్ అయింది. గురువారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో వెస్టిండిస్‌పై ఇంగ్లాండ్ జట్టు 186 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరిస్‌ను 3-0తో ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 328 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు జో రూట్ 101, అలెక్స్ హేల్స్ 110 పరుగులతో సెంచరీలు సాధించారు. రెండో వికెట్‌కు ఇంగ్లాండ్ 192 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

అనంతరం ఇంగ్లాండ్ నిర్దేశించిన 329 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ 39.2 ఓవర్లలో 142 పరుగులకే అలౌటైంది. వెస్టిండిస్ ఆటగాళ్లలో కార్టర్ 46 మినహా ఎవరూ రాణించక పోవడంతో ఆ జట్టు దారుణమైన ఓటమి పాలైంది.
ఈ క్రమంలో ఇంగ్లాండ్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అది పెద్ద విజయాన్ని నమోదు చేసింది. 1991 తర్వాత ఇంగ్లాండ్‌లో కరీబియన్లు వైట్ వాష్ కావడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో సెంచరీతో రాణించిన అలెక్స్ హాల్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications