సిడ్నీ : ఎడమ కాలి గాయంతో తీవ్రంగా బాధపడుతోన్న ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కు సర్జరీ చేశారు వైద్యులు. గాయం మరింత తీవ్రం కావడంతో అతని కాలికి 30కుట్లు వేశారు వైద్యులు. అయితే కాలి ఎముకకు మాత్రం ఎలాంటి గాయం అవలేదనినిర్దారించారు.

క్రికెట్ ఆస్ట్రేలియా ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ జాన్ ఆర్చడ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా,గురువారం నాటి ప్రాక్టీస్ సెషన్ సందర్బంగా మిచెల్ స్టార్క్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. స్టార్క్ కు గాయమైన వెంటనే అంబులెన్స్ ద్వారా అతన్నిసెయింట్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. కుట్లను తొలగించేవరకు.. రెండు నుంచి మూడు వారాల పాటు స్టార్క్ ఆసుపత్రిలోనే ఉండనున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలుతెలిపాయి.
ఇదిలా ఉంటే.. నవంబర్ 3వ తేదీ నుంచి దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడబోతుంది ఆస్ట్రేలియా. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ పెర్త్ వేదికగా జరగనుంది.