IPL 2022: మెగా వేలంలో డుప్లెసిస్‌పై ఆ మూడు టీంల కన్ను! ధర ఎంతంటే..

ఐపీఎల్ మెగా వేలానికి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లపై ఫ్రాంచైజీలన్నీ దృష్టి సారించాయి. ఇందుకోసం ప్రత్యేకమైన జాబితాను కూడా సిద్ధం చేసుకున్నాయి. దీంతో వేలం ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఐపీఎల్ మెగా వేలానికి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. కాగా ఈ నెల 12, 13వ తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనున్న సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌లో మంచి రికార్డులు
సౌతాఫ్రికా మాజీ ఆటగాడు, గతంలో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఫాఫ్ డుప్లెసిస్ ఈ సారి వేలంలో ముడు టీంలకు మంచి చాయిస్‌గా కనిపిస్తున్నాడు. డుప్లెసిస్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. 37 ఏళ్ల డుప్లెసిస్‌కు ఐపీఎల్‌లో మంచి రికార్డులు ఉన్నాయి. దీనికి తోడు కావాల్సినంత అనుభవం కూడా ఉంది.

డుప్లిసెస్‌పై మూడు టీంలు కన్ను
దీంతో డుప్లెసిస్ జట్టులో ఉంటే యువ ఆటగాళ్లకు మంచి మార్గ నిర్ధేశంగా ఉంటాడని మూడు ప్రాంచైజీలు అభిప్రాయపడుతున్నాయట. దీంతో వేలంలో డుప్లిసెస్‌ను కొనుగోలు చేయాలని చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, అహ్మదాబాద్ ఆసక్తి చూపిస్తున్నాయని సమాచారం. మరోసారి వేలంలో డుప్లెసిస్‌ను కొనుగోలు చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తుంది. ఇప్పటివరకు ఒక్క సారి కూడా ట్రోఫీ గెలవలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కొత్త టీం అహ్మదాబాద్ కూడా డుప్లెసిస్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి.

సీఎస్కేతో సుదీర్ఘ ప్రయాణం
ఐపీఎల్‌లో 2012 నుంచి ఆడుతున్న డుప్లిసెస్ ఈ పదేళ్ల కాలంలో చెన్నై సూపర్ కింగ్స్‌కే ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 100 మ్యాచ్‌లు ఆడి 34 సగటుతో 2935 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 96 పరుగులు. ఇక గత ఏడాది సీఎస్కే ట్రోఫీ గెలవడంలో డుప్లెసిస్ కీలక పాత్ర పోషించాడు. 16 మ్యాచ్‌ల్లో 45 సగటుతో 633 పరుగులు చేశాడు. ఇంతలా ఆడినప్పటికీ ఆశ్చర్యకరంగా చెన్నై రిటెన్షన్ జాబితాలో డుప్లెసిస్‌కు చోటు దక్కలేదు. దీంతో డుప్లెసిస్ వేలంలోకి వచ్చాడు. ఆ జట్టు గతంలో డుప్లెసిస్‌ను 1.60 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కాగా ఈ సారి చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, మొయిన్ అలీని రిటైన్ చేసుకుంది.

ధర ఎంతంటే..
ఐపీఎల్ మెగా వేలంలో ఈ సారి ఫాఫ్ డుప్లెసిస్ 2 కోట్ల రూపాయల కనీస ధరతో ఉన్నాడు. అయితే అనుభవజ్ఞుడైన డుప్లెసిస్ కోసం వేలంలో చెన్నైసూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, అహ్మదాబాద్ మధ్య పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో డుప్లెసిస్ వేలంలో 6 కోట్ల రూపాయల నుంచి 8 కోట్ల రూపాయల ధర పలుకుతాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications