Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మార్గోవా మూడో వన్డే రద్దు : 1-0తో సిరీస్ భారత్ వశం

India vs Australia
మార్గోవా: వన్డే సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. మార్గోవాలో ఆదివారం జరిగే మ్యాచ్ రద్దవడంతో భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. పిచ్ తడిగా ఉన్న కారణంగా మ్యాచ్ రిఫరీ మ్యాచ్ ను రద్దు చేశాడు. అంతకుముందు కోచి వన్టే కూడా రద్దయింది. విశాఖ, మార్గోవా మ్యాచ్ లు వర్షంతోనే రద్దయ్యాయి. ఇక విశాఖపట్టణంలో జరిగిన మ్యాచ్ భారత్ గెలిచినది. దీంతో భారత్ 1-0తో సిరీస్ ను లాగేసుకుంది. ఈ వన్డేపై ఆస్ట్రేలియాతో పాటు భారత్ భారీ ఆశలు పెట్టుకున్నాయి. అయితే వారి ఆశలను వరుణుడు అడియాసలు చేశాడు.ఈ మ్యాచ్ లో నెగ్గి సిరీస్ సమం చేద్దామనుకున్న ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియాపై నెగ్గి టెస్టులాగే వైట్ వాష్ చేద్దామనుకున్న భారత్ ఆశలు నీరుగారాయి.

అంతకుముందు భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరనగన్న మూడో వన్డే మ్యాచ్ కాస్త ఆలస్యమయ్యేట్టున్నాయనే వార్తలు వచ్చాయి. మార్గోవాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా నెహ్రూ స్టేడియంలో ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యం కానున్నట్లు రిఫరీ ప్రకటించారు. మైదానం తడిదా ఉన్నందున మ్యాచ్ ఆలస్యం కావటంతో పాటు, ఓవర్లను తగ్గించే అవకాశముందని చెప్పారు. పిచ్ పరిస్థితిని 11 గంటలకు ఒకసారి, 12.15కు ఒకసారి పరీక్షించిన మ్యాచ్ రెఫరీ మ్యాచ్ ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+