
ధోనీ ఆడిన బ్యాట్‌కు ప్రపంచంలోనే అత్యధిక ధర:
ఎన్నో మ్యాచ్‌ల్లో ధోనీ తన బ్యాట్‌తో సిక్స్‌లు కొట్టి భారత జట్టుకు అపూర్వ విజయాలను అందించాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్స్. ఏప్రిల్ 2న ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ సిక్స్ కొట్టి భారత్‌కు మధురమైన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడిన బ్యాట్ ప్రపంచంలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయింది.

భారత కరెన్సీలో సుమారు రూ.72లక్షలు:
యూకేలో ‘ఈస్ట్ మీట్స్ వెస్ట్' పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధోనీ బ్యాట్‌ను వేలం వేశారు. భారత్‌కు చెందిన ఆర్‌కే గ్లోబల్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ వారు దాన్ని రికార్డు ధరకు సొంతం చేసుకున్నారు. ఇంతకీ ఈ బ్యాట్ ఎంత ధర పలికిందంటే 161,295 అమెరికన్ డాలర్లు. మన కరెన్సీలో సుమారు రూ.72లక్షలు(2011 డాలర్ ధర ప్రకారం). ప్రపంచంలో అత్యధిక ధర పలికిన బ్యాట్‌గా ధోనీ వాడిన ఈ బ్యాట్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఓ ఫౌండేషన్ ద్వారా భారత్‌లోని నిరుపేద పిల్లల కోసం ఉపయోగించినట్లు సమాచారం.

72 సంవత్సరాల 192 రోజుల వయస్సులో:
కొంతకాలం బాంబే గవర్నర్‌గా పని చేసిన ఈయన.. ఆలస్యంగా క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. కథ్‌పురా రాయల్ కుటుంబానికి చెందిన రాజా మహారాజ్ సింగ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ను అక్షరాలా 72 సంవత్సరాల 192 రోజుల వయస్సులో. . ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడిన అత్యంత పెద్ద వయస్కుడిగా రాజా మహారాజ్ సింగ్ గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించారు. గవర్నర్స్ ఎలెవన్-కామన్వెల్త్ ఎలెవన్ మధ్య నిర్వహించిన మ్యాచ్‌లో రాజా తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగారు. గవర్నర్స్ ఎలెవన్ జట్టుకు నాయకుడు రాజానే. ఈ మ్యాచ్‌లో ఆయన నాలుగు పరుగులు మాత్రమే చేశారు. ఆ తర్వాత ఆయన ఫీల్డింగ్ చేయడానికి కూడా మైదానంలోకి రాలేదు.

50 గంటల పాటు నెట్ సెషన్‌లో:
24 ఏళ్ల వయసులో విరాగ్ మారే గిన్నీస్ బుక్‌లో తన పేరును లిఖించుకున్నాడు. ఇంతకీ తనేం చేశాడంటే.. 50 గంటల పాటు నెట్ సెషన్‌లో గడపడం. 2015 డిసెంబరు 22న నెట్ సెషన్ ప్రారంభించి డిసెంబరు 24న ముగించాడు. 50గంటల 5నిమిషాల 51 సెకన్ల పాటు అతడు నెట్‌సెషన్‌లో గడిపాడు. ఈ సమయంలో అతడు 2,447 ఓవర్లు అంటే 14,682 బంతుల్ని ఎదుర్కొన్నాడు. నెట్ సెషన్‌లో అత్యధిక సమయం గడిపిన క్రికెటర్‌గా విరాగ్ రికార్డ్ దక్కించుకున్నాడు.


Click it and Unblock the Notifications

