IPL 2022: భారత సీనియర్ బౌలర్లు షమీ, ఉమేష్, అశ్విన్‌పై ఆ టీంల కన్ను! ధర ఎంతంటే..

ఐపీఎల్ మెగా వేలానికి చూస్తుండగానే సమయం వచ్చేసింది. మరో 5 రోజుల్లో బెంగళూరు వేదికగా వేలం జరగబోతుంది. మరో వారం తర్వాత ఏ ఆటగాడు, ఏ ఆటగాడు ఏ జట్టులో ఉండనున్నాడనే విషయం కూడా తేలిపోనుంది. మెగా వేలం కోసం ప్రాంచైజీలన్నీ కూడా తమ వ్యూహాలనతో సిద్ధంగా ఉన్నాయి. వేలం మొదలవడమే తర్వాయి తమ వ్యూహాలను అమలు చేయనున్నాయి.

ఆ టీంల కన్ను
ఈ నేపథ్యంలో టీమిండియా సీనియర్ బౌలర్లపై పలు ఫ్రాంచైజీలు కన్నేశాయని తెలుస్తోంది. సీనియర్లు బౌలర్లైనా మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, రవి చంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మను వేలంలో కొనుగోలు చేయడానికి పలు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నాయట. ఆసక్తి చూపుతున్న ఫ్రాంచైజీల్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు ఉన్నాయని సమాచారం. ఈ నాలుగు జట్లు ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న టీమిండియా ఈ నలుగురు బౌలర్లపై కన్నేశాయని తెలుస్తోంది. వేలంలో వీరిని కొనడానికి తెగ ఆసక్తి చూపుతున్నాయట.

ఏ ఆటగాడు ఏ జట్టులోకి
ప్రస్తుతం టీమిండియాలో నిలకడగా రాణిస్తున్న ఈ నలుగురు సీనియర్ బౌలర్లలో ఎవరో ఒకరు తమ జట్టులో ఉంటే తమ బౌలింగ్ దళం బలపడుతుందని ఆయా ఫ్రాంచైజీలు భావిస్తున్నాయట. వీరికున్న అనుభవం కూడా జట్టుకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రవిచంద్రన్ అశ్విన్‌పై చెన్నైసూపర్ కింగ్స్, మహ్మద్ షమీపై ఢిల్లీ క్యాపిటల్స్, ఉమేష్ యాదవ్‌పై పంజాబ్ కింగ్స్, ఇషాంత్ శర్మపై అహ్మదాబాద్ జట్లు కన్నేసాయట. వేలంలో ఆ నలుగురిని కొనుగోలు చేయడానికి ఈ నాలుగు ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరుస్తున్నాయని తెలుస్తోంది.

రిటెన్షన్ జాబితాలో దక్కని చోటు
గత సీజన్లో ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఈ నలుగురికి ఈ సారి ఆ జట్ల రిటెన్షన్ జాబితాలో చోటు దక్కలేదు. దీంతో ఈ సారి వేలంలోకి వచ్చారు. వీరికి రిటెన్షన్ జాబితాలో చోటు దక్కకపోవడానికి వీరికున్న అత్యధిక ధర, ఎక్కువ వయసు ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ నలుగురిలో షమీ మినహా అశ్విన్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. షమీ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

ధర ఎంతంటే?
ఈ ఐపీఎల్ మెగా వేలంలో ఇషాంత్ శర్మ 1.5 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్‌తో, ఉమేష్ యాదవ్ 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్‌తో, అశ్విన్ 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్‌తో, మహ్మద్ షమీ 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్‌తో ఉన్నారు. ఇషాంత్ శర్మ కోసం కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్ 3 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు చెల్లించడానిక సిద్ధంగా ఉందట. ఇక ఉమేష్ యాదవ్ కోసం పంజాబ్ కింగ్స్ 3 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలు చెల్లించాలని భావిస్తోందట. మహ్మద్ షమీ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ 4 కోట్ల రూపాయల నుంచి 8 కోట్ల రూపాయల వరకు వెచ్చించడానికి ప్రయత్నిస్తోందని సమాచారం. అలాగే సీనియర్ స్పిన్నర్ అయినా రవిచంద్రన్ అశ్విన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ 4 కోట్ల రూపాయల నుంచి 8 కోట్ల రూపాయల వరకు చెల్లించడాని సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications