IPL 2021: చెన్నై జట్టులోనూ కరోనా కలకలం.. ముగ్గురికి పాజిటివ్! ఐపీఎల్‌ను వాయిదా వేయాలంటూ బీసీసీఐపై ఒత్తిడి!

IPL 2021:3 CSK Members Test COVID-19 Positive | Oneindia Telugu

హైదరాబాద్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 2021పై మ‌రోసారి క‌రోనా వైరస్ మహమ్మారి క‌ల‌క‌లం రేపింది. దేశంలో నెలకొన్న విపత్క పరిస్థితుల నేపథ్యంలో బయో బాబుల్ వాతావరణంలో సాఫీగా సాగిపోతున్న టోర్నీలో సోమవారం పెద్ద అలజడి రేగింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్ బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారినపడినట్లు ఈరోజు ఉదయం వెలుగులోకి వచ్చింది. ఇది తెలిసిన గంటల వ్యవధిలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ మూడు కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో అందరిలో భయాందోళనలు మొదలయ్యాయి.

మరోసారి పరీక్షలు

మరోసారి పరీక్షలు

ఆదివారం వచ్చిన ఫలితాల్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, సీఈవో కాశీ విశ్వనాథన్‌తో పాటు చెన్నై టీమ్ బస్ క్లీనర్ కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. దాంతో ఈ ముగ్గురినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలో ఉన్న మిగతా జట్టు ఆటగాళ్లు, సిబ్బంది అందరికి నెగటివ్ వచింది. అయితే ముందస్తు జాగ్రత్తలో భాగంగా.. వైరస్ సోకిన ముగ్గురికి ఈ రోజు మరోసారి పరీక్షలు చేయనున్నారు. అప్పుడు కూడా వారికి పాజిటివ్‌ వస్తే.. 10 రోజులు ఐసోలేషన్‌లో ఉంచనున్నారు. అనంతరం రెండు వైరస్ పరీక్షలో నెగటివ్ వస్తే మల్లి బబుల్లోకి వస్తారు.

ముంబై మ్యాచ్ సమయంలో డగౌట్‌లోనే బాలాజీ

ముంబై మ్యాచ్ సమయంలో డగౌట్‌లోనే బాలాజీ

శనివారం ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన త్రిల్లర్ మ్యాచులో భారత మాజీ ఫాస్ట్ బౌలర్, చెన్నై బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ జట్టు డగౌట్‌లో ఉన్నాడు. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది కూడా అందరూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు బాలాజీకి పాసిటివ్ రావడంతో.. చెన్నై యాజమాన్యం ఆందోళనలో ఉంది. చెన్నై తన తదుపరి మ్యాచ్ మే 5 న ఢిల్లీలో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచుకు రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో.. మ్యాచ్ నిర్వహించాలా వద్దా అనేది బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది.

Thisara Perera: 32 ఏళ్లకే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ క్రికెట‌ర్‌!!

వాయిదా వేయాలంటూ బీసీసీఐపై ఒత్తిడి

వాయిదా వేయాలంటూ బీసీసీఐపై ఒత్తిడి

కోల్‌కతా నైట్‌రైడర్స్ సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. ఆ జట్టులో కరోనా కేసులు నమోదవడంతో మ్యాచ్ వాయిదాపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు చెన్నై జట్టులో కూడా కరోనా కేసులు రావడంతో.. ఐపీఎల్‌ 2021ను వాయిదా వేయాలంటూ బీసీసీఐపై ఒత్తిడి పెరుగుతోంది. నిజానికి టోర్నీ ప్రారంభానికి ముందే ఇలాంటి డిమాండ్లు వచ్చినా బీసీసీఐ పెద్దగా పట్టించుకోలేదు. భారత్‌లో రెండో విడత కరోనా కలకలం ప్రారంభమైన తర్వాత కూడా ఇలాంటి డిమాండే వచ్చింది. అయినప్పటికీ పట్టించుకోని బీసీసీఐ టోర్నీ నిర్వహణకే మొగ్గు చూపింది. ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి.

బబుల్‌లోకి వైరస్ ఎలా వచ్చింది

బబుల్‌లోకి వైరస్ ఎలా వచ్చింది

అత్యంత కఠినమైన బయో బబుల్‌లో ఉన్న ఆటగాళ్లకు కరోనా సోకడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు బబుల్‌లోకి వైరస్ ఎలా ప్రవేశించిందనే విషయం అంతుపట్టడంలేదు. లీగ్‌లో పాలుపంచుకునే మైదాన సిబ్బంది నుంచి టీవీ క్రూ, హోటల్ సిబ్బంది వరకు అందరూ కఠిన బబుల్‌లోనే ఉంటారు. అలాంటప్పుడు వైరస్ ఎలా వచ్చిందనేది ఎవరికి అర్థం కావడం లేదు. అయితే వరుణ్ చక్రవర్తి బయో బబుల్ ధాటినట్లు ప్రచారం జరుగుతోంది. భుజ గాయానికి స్కానింగ్ తీసేందుకు వరుణ్ బబుల్ వీడి ఆసుపత్రికి వెళ్లినట్లు ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో పేర్కొంది. అక్కడే అతనికి వైరస్ సోకినట్లుందని ప్రచారం జరుగుతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, May 3, 2021, 16:25 [IST]
Other articles published on May 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X