హైదరాబాద్: బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో సంచలన విజయాన్ని నమోదు చేసిన కోహ్లీసేనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ టీమిండియా ప్రధాన స్పిన్నర్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు.
భారత్ Vs ఆస్ట్రేలియా టెస్టు సిరిస్ ఫోటోలు
అశ్విన్ ఓ జీనియస్ అని, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసుకుని విజయంలో కీలక పాత్ర పోషించాడని క్లార్క్ కొనియాడాడు. భారత్ గొప్ప విజయం సాధించిందని, టీమిండియాకు క్లార్క్ అభినందనలు తెలిపారు. అద్భుతమైన సిరిస్ అని చెప్పుకొచ్చాడు.

ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరిస్ 1-1తో సమమైంది. అంతేకాదు భారత్‌లోని అతని అభిమానులందరిని ట్వీట్‌లతో టీమిండియాను అభినందించాలని సూచించారు. ఇక తన ట్విట్టర్‌లో 'వాటే మ్యాచ్, వాటే సీరీస్' అని ట్వీట్టర్‌లో పోస్టు చేశాడు.
ఇక శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర గ్రేట్ ఫైట్ అని, సంక్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్‌గా కోహ్లి సహచరులకు ఉత్సాహం కల్పించడం గొప్ప విషయమని ట్వీట్టర్‌లో పోస్టు చేశాడు. ఇక క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ ఈ మధ్యకాలంలో ఇది ఒక గొప్ప విజయమని, జట్టుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
ఆస్ట్రేలియాపై భారత్ రెండోటెస్టులో సాధించిన అపూర్వ విజయాన్ని బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ చాలా ఆస్వాదించారు. ''ఇండియాఆఆఆఆఆఆఆ!! మీరే అసలైన చాంపియన్లు. ఒకసారి కింద పడిన తర్వాత మళ్లీ లేచి ఆసీస్ అంతు చూశారు! యాఆఆఆఆఆ!!'' అంటూ ఒక ఫోటోను ట్వీట్ చేశారు.
కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో పూణె టెస్టు ఓటమికి కోహ్లీసేన ప్రతీకారం తీర్చుకుంది. దీంతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్ 1-1తో సమమైంది. బెంగుళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా అనూహ్యంగా పుంజుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగాడు.
తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా ఆరు వికెట్లు తీసుకోగా రెండో ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లు తీసుకున్నాడు. భారత బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లు తీసుకోగా ఉమేశ్ యాదవ్ 2, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక మూడో టెస్టు మార్చి 16వ తేదీన రాంచీలో జరగనుంది.