విశాఖపట్నం: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై 247 భారత్ పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత బౌలర్లు చెలరేగిపోయారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను భారత స్పిన్నర్లు కుప్పకూల్చారు.
ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో భారత్ ముందంజలో ఉంది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలిటెస్ట్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 158 పరుగులకే ఆలౌటైంది.
ఇంగ్లాండ్ జట్టులో ఆరుగురు బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్, యాదవ్‌లు చెరో మూడు వికెట్లు తీసుకోగా, జడేజా, షమీ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 455 ఆలౌట్
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 255 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్: 204 ఆలౌట్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 158 ఆలౌట్
మ్యాచ్ ఫలితం: ఇంగ్లాండ్‌పై 246 పరుగుల తేడాతో భారత్ విజయం
ఐదో రోజు ఆట సాగిందిలా:
87/2 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ మరో 71 పరుగులు మాత్రమే జత చేసి ఆలౌటైంది. ఐదో రోజు భారత స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లాండ్ విలవిలలాడింది. లంచ్ సమయానికి ఏడు వికెట్లను కోల్పోయిన ఇంగ్లాండ్ ఆ తర్వాత అరగంట వ్యవధిలో ఇంగ్లాండ్ మిగతా మూడు వికెట్లను కోల్పోయి ఓటమి పాలైంది.
చివరిరోజైన సోమవారం ఆట ప్రారంభం నుంచే ఇంగ్లాండ్ వికెట్ల పతనం కొనసాగింది. ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా క్రీజులో కుదరుకునే ప్రయత్నం చేయలేదు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఆటలో ఇంగ్లాండ్ పోరాటం కనబడితే, చివరి రోజు మాత్రం అందుకు భిన్నంగా సాగింది.
ఆదివారం దాదాపు 60 ఓవర్ల పాటు ఆడి రెండు వికెట్లను కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు సోమవారం మాత్రం 38 ఓవర్లు ఆడి మిగతా 8 వికెట్లను కోల్పోయి ఓటమి పాలైంది. తన అరంగేట్రం టెస్టులోనే భారత స్పిన్నర్ జయంత్ యాదవ్ ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 35 పరుగులు చేయడంతో పాటు, వికెట్ తీసిన జయంత్ ఫీల్డింగ్‌లో కూడా రాణించాడు.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత స్కోరు 200 దాటడంలో ముఖ్య భూమిక పోషించిన జయంత్ యాదవ్ చివరి వరకూ క్రీజులో నిలబడి 27 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 11.3 ఓవర్లు పాటు బౌలింగ్ వేసి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇందులో నాలుగు మెడిన్ ఓవర్లు ఉండటం విశేషం.
విజయం దిశగా టీమిండియా
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. 87/2 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ తడబడుతోంది. ఈ రోజు తొలి సెషన్‌లోనే డకెట్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత 73.6 ఓవర్ల వద్ద జడేజా బౌలింగ్‌లో అలీ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 405 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 96 ఓవర్లకు గాను 8 వికెట్లను కోల్పోయి 148 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టు ఓటమి నుంచి తప్పించుకోవాలంటే ఈరోజంతా ఆడాల్సి ఉంది.
భారత్ Vs ఇంగ్లాండ్ రెండో టెస్టు ఫోటోలు
ఇంకా భారత్ విజయానికి 2 వికెట్లు అవసరం కాగా, ఇంగ్లాండ్ గెలవాలంటే 257 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో స్టువర్ట్ బ్రాడ్ 0, జానీ బెయిర్ స్టో 34 పరుగులతో ఉన్నారు. అంతక ముందు బ్యాటింగ్ చేసిన బెన్ స్టోక్స్ (6) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరాడు.
ఓవర్ నైట్ ఆటగాడు జో రూట్(25) పరుగుల వద్ద షమీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఇక ఏడో వికెట్ గా రషిద్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. దాంతో లంచ్ విరామ సమయానికి ఇంగ్లాండ్ ఏడు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది.

భారత బౌలర్లలో అశ్విన్ రవిచంద్రన్ మూడు వికెట్లు తీసుకోగా, షమీ, రవీంద్ర జడేజాలు రెండు వికెట్లు తీసుకున్నారు. ఇక విశాఖ టెస్టులో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన జయంత్ యాదవ్ ఒక వికెట్ తీసుకున్నాడు.