అత్యధిక వికెట్లు: అశ్విన్ ఖాతాలో మరో రికార్డు
విశాఖపట్నం: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించాడు. ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన టెస్టు బౌలర్‌గా రికార్డు సాధించాడు. [5 వికెట్లు: టెస్టు దిగ్గజాల సరసన అశ్విన్ (ఫోటోలు)
2016లో ఇప్పటి వరకు 55 వికెట్లతో అశ్విన్ మొదటి స్ధానంలో నిలిచాడు. శ్రీలంక స్ఫిన్నర్ రంగన హెరాత్ 54 వికెట్లను కూడా అశ్విన్ అధిగమించాడు. రంగన హెరాత్ ఈ ఘనతను 8 మ్యాచ్‌ల్లో 15 ఇన్నింగ్స్‌ల్లో అందుకోగా, అశ్విన్ 9 మ్యాచ్‌ల్లో 16 ఇన్నింగ్స్‌ల ద్వారా సాధించాడు.

ఐదు వికెట్లను ఆరుసార్లు తీశాడు
అంతేకాదు ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 50 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా అశ్విన్ రికార్డు సృష్టించాడు. విశాఖపట్నం వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు ద్వారా ఈ ఏడాది తొమ్మిదో మ్యాచ్ ఆడిన అశ్విన్ 22.23 యావరేజిని కలిగి ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఐదు వికెట్లను ఆరుసార్లు సాధించి తొలిస్ధానంలో నిలిచాడు.

పది వికెట్లను అశ్విన్ రెండు సార్లు
ఇందులో పది వికెట్లను అశ్విన్ రెండు సార్లు తీశాడు. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు. తమిళనాడుకు చెందిన ఈ 30 ఏళ్ల స్ఫిన్నర్ 2016లో 9 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసుకున్నాడు.

దిగ్గజాల సరసన చేరిన అశ్విన్
దాంతో టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 22 సార్లు 5 వికెట్లు తీసుకున్న ఆటగాళ్ల సరసన చేరాడు. అంతేకాదు ఇటీవల 200 వికెట్లను తీసి ఆ ఘనతను అత్యంత వేగంగా సాధించిన రెండో బౌలర్‌గా కూడా అశ్విన్ రికార్డుని నమోదు చేశాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై 247 భారత్ పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

1-0తో భారత్ ముందంజ
ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో భారత్ ముందంజలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 158 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ జట్టులో ఆరుగురు బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్, యాదవ్‌లు చెరో మూడు వికెట్లు తీసుకోగా, జడేజా, షమీ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications