హరారే: భారత్ - జింబాబ్వే మధ్య జరిగిన రెండో ట్వంటీ 20లో టీమిండియా జింబాబ్వే పైన ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. ప్రతిగా, భారత్ వికెట్ పోకుండా 103 పరుగులు చేసి, సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
భారత్ ఇన్నింగ్స్
- వికెట్ పోకుండా గెలవడం ద్వారా సిరీస్‌ను సమం చేసింది.
- 13 ఓవర్లు ముగిసేసరికి భారత్ పరుగులు 99తో జింబాబ్వే స్కోరుతో సమంగా ఉంది. ఒక పరుగు కావాల్సిన సమయంలో... 14వ ఓవర్ తొలి బంతికి మన్‌దీప్ ఫోర్ కొట్టి అర్ధ సెంచరీ చేశాడు. దీంతో భారత్ 13.1 ఓవర్లో 103 పరుగులు చేసింది.
- మన్‌దీప్ 40 బంతుల్లో 52 పరుగులు, లోకేష్ రాహుల్ 40 బంతుల్లో 47 పరుగులు చేశారు.
- భారత్ ఒక్క వికెట్ కూడా పోకుండా జింబాబ్వే తమ ముందుంచిన 100 లక్ష్యాన్ని 13.1 ఓవర్లో చేధించింది.
- ఐదు ఓవర్లు ముగిసేసరికి ఒక్క వికెట్ పోకుండా 28 పరుగులు చేసింది. లోకేష్ 14 పరుగులు, మన్‌దీప్ 13 పరుగులు చేశాడు.
- మన్‌దీప్ సింగ్, లోకేష్ రాహుల్‌లు బ్యాటింగ్ చేస్తున్నారు.
- 99 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వికెట్ పోకుండా, ఆచితూచి ఆడుతోంది.

జింబాబ్వే ఇన్నింగ్స్
- జింబాబ్వే జట్టులో అత్యధిక స్కోరు మూర్ చేశాడు. అతను 32 బంతుల్లో 31 పరుగులు చేశాడు. మిగతా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.
- స్రాన్ 4 వికెట్లు, కులకర్ణి 1, చాహల్ 1, బూమ్రా 3 వికెట్లు తీశారు.
- నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే 9 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది.
- 20వ ఓవర్లో క్రీమర్ వికెట్‌ను కులకర్ణి తీశాడు. దీంతో తొమ్మిదో వికెట్ పోయింది.
- 17వ ఓవర్లో బూమ్రా రెండు వికెట్లు తీశాడు. చిగుంబర, మద్జీవ వికెట్లను తీశాడు.
- స్రాన్ నాలుగు వికెట్లు, చాహల్ ఒక వికెట్, బూమ్రా ఒక వికెట్ తీశారు.
- 15 ఓవర్లలోపే ఆరు వికెట్లు కోల్పోయింది. పదిహేను ఓవర్లు ముగిసేసరికి 76 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది.
- జింబాబ్వే వికెట్లు టపటపా రాలిపోయాయి. 26 పరుగుల వద్ద మసకద్జ, 28 పరుగుల వద్ద సికందర రాజా, 28 పరుగుల వద్ద ముతోంబోజి, 57 పరుగుల వద్ద వాలర్, 75 పరుగుల వద్ద మూర్ అవుటయ్యారు.
- జింబాబ్వేకు ఆదిలోనే షాక్ తగిలింది. శ్రాన్ వేసిన మూడో ఓవర్లో చిబాబా అవుటయ్యాడు. చిబాబా పదకొండు బంతుల్లో 10 పరుగులు చేశాడు.

భారత జట్టు: ధోనీ (కెప్టెన్), కెఎల్ రాహుల్, మన్‌దీప్ సింగ్, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేదార్ జాదవ్, అక్షర్ పటేల్, ధవల్ కులకర్ణి, జస్ప్రీత్ బూమ్రా, బరిందర్ శ్రాన్, యజ్వేంద్ర చాహల్.
జింబాబ్వే జట్టు: గ్రీమ్ క్రీమర్ (కెప్టెన్), చిబాబా, మసకద్జ, సికందర్ రాజా, మాల్కోమ్ వాలర్, చిగుంబర, పీ మూర్, ముటోంబోడ్జి, మద్జీవా, ముజరబని, దొనాల్డ్ తిరిపానో